Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కొత్త షాకిచ్చిన కోదండరామ్!
By: Tupaki Desk | 26 Sep 2016 2:44 PM GMTతెలంగాణ ఉద్యమంలో సమ ఉజ్జీలుగా పేరొందిన నాయకుల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. ఇప్పటివరకు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అనే ప్రశ్నకు వచ్చే సమాధానం టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఒక్కటే 12 ఏళ్ల ఉద్యమ ఫలమే స్వరాష్ట్రమని టీఆర్ ఎస్ వర్గాలు చెప్తుంటాయి. ఆ మేరకు మైలేజీ పొందే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం తన వల్ల వచ్చిందని తాజాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించేసుకున్నారు. ఇందులో మరింత ఆసక్తికరమైన ఎపిసోడ్ ఏమంటే...ఈ స్టేట్‌మెంట్ కు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పూర్తి మద్దతిచ్చారు. తద్వారా కేసీఆర్ కు షాకిచ్చారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన విభజన కథ పుస్తకంపై నిర్వహించిన చర్చాగోష్టిలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఆ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు జైపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ తన కృషి వల్లే ఏర్పడిందన్నారు. ఆనాటి లోక్ సభ నేతగా ఉన్న బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్ సభలో ఓటింగ్ కోసం పట్టుబట్టినప్పటికీ తాను సమన్వయం చేయడంతో హెడ్ కౌంట్ ద్వారా ఆ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. టీఆర్ ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం రాలేదని స్పష్టం చేశారు. దీనిపై టీఆర్ ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేసీఆర్ వల్లే రాష్ట్ర ఏర్పడిందని తెలిపాయి. ఈ క్రమంలో కోదండరాం ఆసక్తికరమైన ప్రకటన చేశారు. 2009 డిసెంబర్ 7న అన్ని పార్టీల ఆంధ్రా నేతలు కూడా అఖిల పక్షంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటనలు చేసినప్పటికీ పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆనాడు జైపాల్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించి అప్పటి పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కమల్ నాథ్ - బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మాస్వరాజ్ ల మధ్య సయోధ్య కుదిర్చిన బిల్లు పాసయ్యేలా చేశారని చెప్పారు.
అయితే ఆసక్తికరంగా ఇందులో ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కానీ, ఆయన పోషించిన పాత్ర కానీ లేకపోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం నిరసన గళం విప్పుతున్న కోదండరాం ఈ విధంగా కేసీఆర్‌ను కొత్త తరహాలో అటాక్ చేశారని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.