Begin typing your search above and press return to search.
ఇందుకే కోదండరాం మీడియా ముందుకు రావట్లేదా?
By: Tupaki Desk | 16 Nov 2018 4:41 AM GMTతెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గందరగోళంలో పడిపోయారా? కూటమి పేరుతో జట్టుకట్టి కోదండరాంను తమ పంచన చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని టికెట్లు ఇవ్వకుండా...కోరిన నియోకజవర్గాలు కాకుండా ఇతర స్థానాల్లో అవకాశం ఇవ్వడం ద్వారానే అవమానపర్చిన రీతిలోనే మరింతగా వ్యవహరిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరిపట్ల టీజేఎస్ లోని ముఖ్యనేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారాలతో విసుగుచెందిన పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్‌రావు - అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి రంగంలోకి దిగి.. తమకు ఆరు సీట్లు కాదు.. 12 సీట్లు కావాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా.. తాము పోటీచేసే స్థానాల పేర్లను కూడా ప్రకటించారు. ఇదే సమయంలో ఒకవైపు పుణ్యకాలం గడిచిపోతున్నా.. ఏం చేస్తున్నారంటూ కోదండరాంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు చర్చలు - సంప్రదింపుల్లో కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కోదండరాం మౌనం వహించారని - అందుకే మీడియాకు కూడా అందుబాటులో ఉండటం లేదని పలువురు అంటున్నారు.
మహాకూటమి భాగస్వామి తెలంగాణ జనసమితి సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. ఇతర పార్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతే టీజేఎస్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ పార్టీ నేతలు 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మహాకూటమిలో ఆ పార్టీ కొనసాగుతుందా లేక కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహం పన్నుతున్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పలువురు చెబుతున్నారు. సీట్లు దక్కని అసంతృప్తులను కాపాడుకునేందుకు ఇదో ఎత్తుగడ కూడా ఉండొచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు 8 స్థానాలు కేటాయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిజం చేస్తూ తమకు ఆరు స్థానాలు దక్కాయని వాటిపై ఇక ఎలాంటి అనుమానాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు - ప్రోఫెసర్ కోదండరాం తెల్చి చెప్పారు. తాము 34 స్థానాలను కోరామని - అయితే, వాటిపై పొత్తుల్లో బాగంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో చివరకు ఎనిమిది కోరుకున్నామని చెప్పారు.
కాగా, జనగామ టికెట్ కోసం కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అక్కడ పోటీకి సిద్ధమవుతుండటం తమకు నెలకొన్న గందరగోళానికి నిదర్శనమని పలువురు అంటున్నారు. ఇప్పటికే కోదండరాం పేరిట ప్రచార రథాలు సిద్ధమవ్వగా...బీసీ నేత సీటును తాము తన్నుకుపోతున్నామని అపవాదు మోయాల్సి వస్తోందని, ఇదంతా కాంగ్రెస్ తమకు సీట్లు కేటాయించకపోవడం వల్ల జరిగిన ఫలితమని టీజేఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల గుస్సాతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఢిల్లీ వెళ్లారు. కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన వివాదాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించేందుకు గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. నేడు జరగనున్న చర్చలతో పూర్తి క్లారిటీ రానున్నట్లు సమాచారం.