Begin typing your search above and press return to search.

కోదండంమాష్టారి ‘సోషల్’ సంచలనం

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:53 AM GMT
కోదండంమాష్టారి ‘సోషల్’ సంచలనం
X
తెలంగాణ రాష్ట్ర సాధనలో నిజాయితీగా పని చేసి.. ఎలాంటి పదవుల్ని ఆశించకుండా జనజీవన స్రవంతిలో ఒకడిలా ఉంటానని చెప్పటమే కాదు.. చేసి చూపించిన నేతగా కోదండం మాష్టార్ని చెప్పాలి. ప్రజాసమస్యలే తన ఎజెండా అని.. అధికారం తనకేమాత్రం అక్కర్లేదని చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతా.. ఎలాంటి పదవుల్ని తీసుకోకుండా ఉండిపోయి తానేంటో చేతల్లో చేసి చూపించారు.

గడిచిన కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతున్న ఆయన.. కాస్తంత ఆలస్యంగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. పాదయాత్రలు.. నిరసన ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇచ్చిన కోదండరాం ఆ మధ్యన తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అయితే.. తన వాదనను ప్రజల్లోకి మరింత పాపులర్ చేయటానికి పాత విధానాలకంటే.. సోషల్ మీడియాతో ద్వారా తన గళాన్ని వినిపించాలన్న విషయాన్ని ఆ మధ్యన చెప్పిన కోదండం మాష్టారు అందుకు తగ్గట్లే.. ఈ నెల 22న నిర్వహించనున్న‘నిరుద్యోగుల నిరసన ర్యాలీ’కి బోనాల జాతర మాదిరి తరలిరావాలంటూ పిలుపునిస్తున్నారు.

తొలిసారి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆయన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆయన వీడియోను 24 గంటల వ్యవధిలో 1.24లక్షల మంది చూడటమేకాదు.. ఇది ప్రసారమైన మూడు గంటల్లోనే 16వేల మంది చూడటం గమనార్హం. నిరుద్యోగుల పక్షాననిర్వహించే కోదండం మాష్టారి ర్యాలీకి తాము తప్పక మద్దతు ఇస్తామన్న కామెంట్లను పలువురు పోస్ట్ చేయటం గమనార్హం.

అంతేకాదు.. ఫేస్ బుక్ లోని రియాక్షన్ బటన్ ద్వారా 8700 మంది రియాక్ట్ కావటమే కాదు.. లైవ్ కార్యక్రమంలో 4500 మంది కామెంట్లు చేశారు. మొత్తంగా కోదండం మాష్టారి సోషల్ నెట్ వర్క్ పోగ్రాం భారీ సక్సెస్ కావటం ఆసక్తికరంగా మారింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/