Begin typing your search above and press return to search.

అందలం ఎక్కిస్తారా... కిందకి తోసేస్తారా..

By:  Tupaki Desk   |   12 Nov 2018 11:35 AM GMT
అందలం ఎక్కిస్తారా... కిందకి తోసేస్తారా..
X
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్‌ కు మహాకూటమి కన్వీనర్‌ గా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవి ఆయనకు భారం కానుందా అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. కొన్ని సంవ‌త్సరాల క్రితం ఆయన అందరికీ ఒక ప్రొఫెసర్‌గానే తెలుసు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమ నేతగా - తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ గా పనిచేశారు. కొన్ని అనుకోని పరిస్థితులలో జేఏసీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ జన సమితి అనే పార్టీని పెట్టారు.

అయితే పార్టీ పెట్టినంత తెలిక కాదు - పార్టీని నడిపించడం అన్న నగ్న సత్యం ఆయనకు కొద్ది రోజులకే తెలిసి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలు కలసి మహాకూటమిగా ఏర్పాడ్డాయి. ముందస్తు ఎన్నికల తర్వాత కూడా కోదండరామే మహాకూటమికి కన్వీనర్‌గా కొనసాగుతారని కాంగ్రెస్‌ - తెలుగుదేశం పార్టీలు చెబుతున్నాయి. అయితే మహాకూటమికి కన్వీనర్ గా ఉంటూ తెజస పార్టీ కార్యకలాపాలకు సమయం ఉంటుందా... ఇక ఆ పార్టీ బాగోగులు చూసుకునే వీలు ఉంటుందా.... లేక రాజకీయాలలో ఆరితేరిన తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలో ఆయనను పులుసులో ముక్కలాగా... పేకాటలో జోకర్‌లాగా మార‌నున్నారా అనే అనుమానం వస్తోంది.

రాబోయే రోజులలో మహాకూటమిలో కోదండరామ్‌ పాత్ర ఏ మాత్రం ఉండబోదని, ఆయన కేవలం ఒక ఉత్సవ విగ్రహంగానే మిగలనున్నారని విశ్లేషకులు అంటున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోదండరామ్‌కు ఉందని చెప్పిన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు... ఆయనను మహాకూటమికి కన్వీనర్‌గా అందలం ఎక్కించి, ముఖ్యమంత్రి రేసులో లేకుండా చేసారని రాజకీయ పండితులు అంటున్నారు. మహాకూటమికి కన్వీనర్‌గా కొనసాగితే రాబోయే రోజులలో తెలంగాణ జన సమితి పార్టీ ఉనికి కూడా ఉండబోదని గులాబీ శ్రేణులు చెవులు కొరుకుంటున్నారు.. చూద్దం కోదండరామ్‌ భవిష‌్యత్తు ఏమిటో.