Begin typing your search above and press return to search.
అసలేమాత్రం తగ్గేది లేదంటున్న కోదండరాం
By: Tupaki Desk | 15 Feb 2017 6:31 AM GMTతెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన మాట అంటే మాటేనని నిరూపించుకున్నారు.రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు ‘మా కొలువులు మాకు కావాలి’ అనే పేరిట ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణకు అనుమతి వస్తుందనే నమ్మకం ఉందని, ఒకవేళ అనుమతి రాకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని కోదండ రాం స్పష్టం చేశారు. మార్చ్ టు జాబ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో తలపెట్టిన ర్యాలీకి నిరుద్యోగులను సన్నద్ధం చేసే క్రమంలో కరీంనగర్ లో సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన కోదండరాం అంతకుముందు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలోని లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తెరాస సర్కారు అమలు చేయాలని కోదండ రాం డిమాండ్ చేశారు. ఉద్యమ ట్యాగ్ లైన్ మరిచిన ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల పోకడలతో తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, కొత్త రాష్ట్రంలో దీనికి చరమగీతం తథ్యమనుకుంటే మరింత పెరుగుతోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5నుంచి 6 వేల వరకు మాత్రమే భర్తీ చేసిందని, వీటిలో అత్యధికంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులే ఉన్నాయని అన్నారు. మరో 11 వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న 11 వేల ఉపాధ్యాయ పోస్టులు, 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి 32 వేల పోస్టులు భర్తీ చేయలేదని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో 50 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు ‘మా కొలువులు మాకు కావాలి’ అనే పేరిట ఈ నెల 22న ప్రత్యేక కార్యక్రమం తలపెట్టినట్లు కోదండరాం వివరించారు.
రెండున్నరేళ్ళ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోదగిన స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని కోదండ రాం అన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాలన్న లక్ష్యంతో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని, ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రైవేట్ రంగ ఉద్యోగాల భర్తీలో స్థానిక రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయానికి, చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ కూడా సత్వరమే ప్రకటించాలని కోదండరాం కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తుచేస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ సీమాంధ్రుల దారిలోనే ప్రభుత్వ నేతలు నడవడం శోచనీయమన్నారు. ఒకవేళ ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ల తేదీలను ప్రకటిస్తే నిరుద్యోగ ర్యాలీపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/