Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారికి బీజేపీ 'బూస్ట్'..!

By:  Tupaki Desk   |   5 April 2017 4:37 AM GMT
కోదండం మాష్టారికి బీజేపీ బూస్ట్..!
X
త‌న బ‌లాన్ని తాను స‌రిగా అంచ‌నా వేసుకున్నోడే తెలివైనోడు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజ‌కీయ‌రంగంలో ఉండేవారు ఈ విష‌యంలో మ‌రింత అలెర్ట్ గా ఉండాలి. ఆ విష‌యంలో కోదండ‌రాం మాష్టారు కాస్త ప్రాక్టిక‌ల్ గా ఆలోచించ‌టం షురూ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొద‌ట్లో వామ‌ప‌క్ష నేత‌ల‌కు రాసుకుపూసుకు తిరిగి.. త‌ర్వాత‌కాలంలో కాంగ్రెస్ నేత‌ల‌తో క్లోజ్‌ గా ఉన్న ఆయ‌న‌.. మారిన కాలానికి.. మారిపోయిన రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లు తాను మారాల‌న్నట్లుగా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో బీజేపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించినా.. వారితో క‌లిసి అడుగులు వేయ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని మాష్టారు.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడితో భేటీ కావ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పాలి. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా మారిన అధికార‌ప‌క్షానికి చెక్ చెప్పాలంటే మ‌రింత బ‌లం అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన కోదండం మాష్టారు.. బీజేపీ బూస్ట్ అవ‌స‌రమ‌న్న స‌త్యాన్ని గుర్తించిన‌ట్లు క‌నిపిస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించాల‌ని వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీతో క‌లిసి ప‌ని చేస్తే త‌ప్పించి.. కేసీఆర్ అండ్ కోల‌కు చెక్ పెట్టే అవ‌కాశం లేద‌న్న భావ‌న‌కు ఆయ‌న వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. తాజా భేటీ అని చెబుతున్నారు.

ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. ల‌క్ష్మ‌ణ్‌.. కోదండం మాష్టారి భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు చూస్తే.. భిన్న‌ధ్రువాలు క‌లిసి ప్ర‌యాణం చేసే దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకున్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

టీఆర్ ఎస్ స‌ర్కారు అనుస‌రిస్తున్న తీరు.. ప‌లు అంశాల విష‌యంలో సీఎం కేసీఆర్ తాను అనుకున్న‌దే చేయ‌టం త‌ప్పించి.. విప‌క్షాల విన‌తుల్ని పెడ చెవిన పెట్ట‌టం.. ఉద్య‌మాల్ని.. నిర‌స‌న‌ల్ని ఉక్కుపాదంతో అణిచివేయ‌టం.. లాంటి అంశాల‌పై ఇరువురి మ‌ధ్య‌న చ‌ర్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ వ్యూహాన్ని కూడా అడిగి తెలుసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. పొత్తుల‌కు అవ‌కాశం ఉందా? అన్న ప్ర‌శ్న‌ను ల‌క్ష్మ‌ణ్‌ ను అడిగిన‌ట్లుగా తెలుస్తోంది. తాము ఎవ‌రితోనూ పొత్తులు పెట్టుకోమ‌ని.. ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్లు ల‌క్ష్మ‌ణ్ చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

ఇందిరాపార్క్ వ‌ద్ద‌నున్న‌ ధ‌ర్నాచౌక్ త‌ర‌లింపు..సింగ‌రేణి ఓపెన్‌ కాస్ట్‌ల కొన‌సాగింపు త‌దిత‌ర అంశాల్లో క‌లిసి పని చేద్దామ‌న్న మాట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కోదండం మాష్టారి వెంట‌.. ప‌లువురు బీసీ.. ద‌ళిత‌ సంఘ నేత‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో రాష్ట్రానికి బీజేపీ చీఫ్ అమిత్ షా వ‌స్తున్న వేళ‌.. కోదండంమాష్టారు భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసిన‌ట్లుగా చెప్పాలి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన ప్ర‌తిప‌క్షాల గొంతును అసెంబ్లీలో నొక్కేస్తున్న వైనం కోదండ‌రాం త‌న అభిప్రాయాన్ని చెప్ప‌గా.. ల‌క్ష్మ‌ణ్ అందుకు ఆస‌క్తిక‌ర ఆఫ‌ర్ ఒక‌టి ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ స‌ర్కారుపై పోరాటానికి ప్ర‌జాసంఘాల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. కోదండ‌రాం.. జ‌స్టిస్ చంద్ర‌కుమార్‌.. ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌.. మంద‌కృష్ణ మాదిగ‌.. ప్ర‌జాసంఘాల ఫ్రంట్ గా ముందుకు వ‌స్తే తాము మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని ల‌క్ష్మ‌ణ్ చేసినట్లుగా చెబుతున‌న వ్యాఖ్య కాని నిజ‌మైతే. తెలంగాణ‌లో స‌రికొత్త రాజ‌కీయానికి తెర లేసిన‌ట్లేన‌ని చెప్పాలి. కేసీఆర్ లాంటి నేత‌ను ఎదుర్కోవ‌టానికి బీజేపీ టానిక్ అవ‌స‌ర‌మ‌న్న స‌త్యాన్ని కోదండ‌రాం లాంటి వారు గ్ర‌హించ‌టం.. గులాబీ అధినేత‌కు కొత్త తీసుకురావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/