Begin typing your search above and press return to search.
అన్ని బ్యాంకుల్ని కోదండరాం అడుగుతారా?
By: Tupaki Desk | 8 Dec 2015 3:58 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాజాగా ఆయన ఆంధ్రాబ్యాంక్ కొత్త సీఈవో సురేష్ పటేల్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రా బ్యాంకు ఉద్యోగాలు ఇక్కడి వారికే ఇవ్వాలంటూ కోరారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించి తెలంగాణ ప్రాంతం వారికే ఉద్యోగాలు ఇవ్వాలనటం ఇప్పుడు చర్చగా మారింది.
బ్యాంకులకు సంబంధించి ఒక క్రమపద్ధతిలో అపాయింట్ మెంట్స్ జరుగుతుంటాయి. కానీ.. అందుకు భిన్నంగా ఫలానా ప్రాంతం వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కోరటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా బ్యాంకు మాదిరే.. మిగిలిన బ్యాంకుల వద్దకు వెళ్లి.. బ్యాంకు ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికి మాత్రమే ఇవ్వాలని కోరతారా? అన్న ప్రశ్నలు వేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు కావటం వల్లే కోదండరాం అడగగలిగారని.. అదే విషయాన్ని మిగిలిన బ్యాంకుల సీఈవోలను కలిసి కోరగలరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. ఇలాంటి వాదనకు కోదండరాం మాష్టారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో..?