Begin typing your search above and press return to search.
కోదండరాం ఆధ్వర్యంలో మరో మిలియన్ మార్చ్
By: Tupaki Desk | 18 Dec 2016 2:43 PM GMTతెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ గుర్తుండే ఉంటుంది. స్వరాష్ట్రం సాధించుకునేందుకు తెలంగాణ వాదులంతా ఒకచోట చేరి తమ సత్తా చాటారు. అపుడు అలాంటి సీన్ మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంపై అవకాశం దొరికినపుడల్లా విమర్శిస్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈ మార్చ్ కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దఫా టీఆర్ఎస్‌తో సంబంధం లేకుండా కోదండరాం ముందుకు సాగుతున్నారు.
వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారు వైఫల్యాలకు వ్యతిరేకంగా కోదండరాం ఈ మార్చ్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు కీలక విపక్షాలైన టీడీపీ - బీజేపీ - వామపక్షాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కోదండరాం సిద్దమైనట్లు సమాచారం. ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అన్ని పక్షాలతో చర్చలు పూర్తయిన తర్వాతనే తేదీ నిర్ణయించననున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/