Begin typing your search above and press return to search.
కోదండం మాష్టారి ఫోన్ ట్యాప్ అవుతోంది
By: Tupaki Desk | 16 Aug 2016 5:59 AM GMTఈ విషయాన్ని మేమేం చెప్పటం లేదు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్వయంగా ఈ మాటల్ని చెప్పారు. ఫోన్ ట్యాప్ చేయటం అంటే.. వాక్ స్వాతంత్ర్యాన్ని.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని.. ఇది ఏ మాత్రం మంచిది కాదంటూ ఆయన గుస్సా అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ఫోన్ ను ట్యాప్ చేస్తోందంటూ కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. ఈ విషయం మీద ఆయన సూటిగా మాట్లాడింది లేదు. కానీ.. ఇందుకు భిన్నంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు
తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న పక్కా సమాచారం తనకు ఉందని.. ఇలా చేయటమంటే తన వ్యక్తిగత.. రాజకీయ స్వేచ్ఛను హరించటంగా ఆయన అభివర్ణించారు. ‘‘నా ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయంపై సరైన సాక్ష్యం లేని కారణంగానే కొంతకాలంగా మౌనంగా ఉన్నా. ఈ విషయంపై ఇటీవల మీడియాలో వార్తలు రావటంతో చెబుతున్నా. నా ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయంపై నాకు పూర్తి సమాచారం ఉంది’’ అని చెప్పారు.
ఇలాంటి చర్యలు ఏ మాత్రం మంచిది కాదని.. సత్సాంప్రదాయానికి మచ్చ తెస్తాయన్న ఆందోళన వ్యక్తం చేసిన కోదండరాం.. తాను ప్రజల తరఫున పని చేస్తున్నందున ప్రమాదం లేదనే ఫిర్యాదు చేయాలని అనుకోవటం లేదని చెప్పారు. నేరగాళ్ల విషయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగానే చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. కోదండరాం ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కోదండరాం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ ను ఎంతోకొంత ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడిపై తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడుతుందన్న సమాచారం ప్రభుత్వ పరపతిని ఎంతోకొంత దెబ్బ తీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.