Begin typing your search above and press return to search.
కోదండం మాష్టారు కొత్త పార్టీ పెడుతున్నారా?
By: Tupaki Desk | 7 Aug 2015 6:51 AM GMTcతెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లో.. గత రెండు నెలలుగా కోదండం మాష్టారి మాటలో కాస్తంత తేడా రావటం తెలిసిందే. గతంలో తెలంగాణ సర్కారుపై చిన్న విమర్శ చేయటానికి సుతారంగా ఉండే ఆయన.. కొద్ది రోజులుగా తన గొంతు విప్పుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వైఖరిపై ఆయనకున్న అసంతృప్తితో ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా భావించిన దానికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో.. తెలంగాణలోనూ ఒక పార్టీ ఏర్పాటు చేయాలని.. తెలంగాణ జాయింట్ యాక్షన్ పార్టీ లేదంటే స్వరాజ్యం పార్టీని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో అణగారిన వర్గాల కోసం స్వరాజ్యం పార్టీని తెరపైకి తీసుకొచ్చి.. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెర తీయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇందుకోసం కోదండం మాష్టారికి బలమైన దన్ను లభించిందన్న మాట వినిపిస్తోంది. ఢిల్లీలోని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సహాయ సహకారాలు అందించి.. ఢిల్లీలో సామాన్యుడి పార్టీ కొలువు తీరేలా చేయటంలో కీలకపాత్ర పోషించిన ముఖ్యుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్ తెలంగాణలో కోదండరాంకు అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆమ్ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన యోగేంద్ర స్వరాజ్ అభియాన్ అనే కొత్త వేదికను ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి సారించిన ఆయన.. కోదండరాంతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. వీరి మధ్య కీలక సమావేశం ఈ నెల 10న జరుగుతుందని భావిస్తున్నరు.
వీరు కానీ చేతులు కలిపే అంశం వాస్తవ రూపం దాలిస్తే.. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉద్యమ నేపథ్యం ఉన్న బలమైన వర్గం ఒకటి తెరపైకి రావటం ఖాయం అవుతుందని చెబుతున్నారు. మరోవైపు.. ఎన్నికల సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొత్త పథకాల విషయంలో తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందన్న అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం అంచనాగా ఉన్న ఈ వ్యవహారం వాస్తవ రూపం దాలిస్తే.. తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారటం ఖాయమంటున్నారు.