Begin typing your search above and press return to search.
కోదండరాం పార్టీ పేరు అదిరింది
By: Tupaki Desk | 17 May 2017 6:40 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. అది కూడా తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న జూన్ 2 వేదికగా ఈ నూతన రాజకీయ వేదిక ఏర్పడనుంది. ఈ పార్టీకి కేసీఆర్ ఒకనాటి ఆప్తుడు, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నడుం బిగించారు. మరో ఆసక్తికరమైన పరిణామం...ఈ పార్టీకి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పూర్తి ఆశిస్సులు ఉండనున్నాయి. ఇంతకీ ఈ పార్టీ పేరు ఏంటంటే....‘తెలంగాణ ఇంటి పార్టీ’!
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యమ శక్తులు ఏకం అవుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పార్టీని ప్రకటించనున్నారు. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఆవిర్భావంలో భాగంగా తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయించారు. వచ్చే నెల 2న పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథులుగా ఆర్‌ఎల్‌డి నేత అజిత్ సింగ్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు హాజరుకానున్నట్లు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. తనకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థుల మద్దతు ఉన్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనకు ఎవరూ ఎదురు చెప్పరాదని, ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చెరుకు సుధాకర్ విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద అనేక సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌ను ఎత్తి వేయడం, మిర్చి రైతులకు కనీస మద్ధతు ధర లభించకపోవడం, రైతులకు బేడీలు వేయించడం వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే ఆ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమ పార్టీలన్నీ కలిసి రావాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉంది కాబట్టి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/