Begin typing your search above and press return to search.

డైలామాలో కోదండరాం.. నెక్ట్స్ ఏంటి.?

By:  Tupaki Desk   |   15 Jan 2019 7:19 AM GMT
డైలామాలో కోదండరాం.. నెక్ట్స్ ఏంటి.?
X
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఎసీ) చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ను విభేదించి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అనే పార్టీని పెట్టారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో చేరారు. కానీ ఎన్నికల్లో ఫలితం బెడిసికొట్టింది. టీజేఎస్ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. కోదండరాం తన ఉనికిని కూడా చాటుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో తెలియని సందిగ్ధంలో కోదండరాం ఉన్నారు. కోదండరాం రాజకీయ జీవితమే ప్రమాదంలో పడినట్టైంది.

పార్లమెంటు ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ కూడా పోటీచేయలేకపోతోంది. ఇక సీపీఐ ఎవరికి మద్దతు ఇవ్వకుండా కామ్ గా ఉంది. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన మహాకూటమి పతనమైనట్టేనని చెప్పకతప్పదు.

ప్రస్తుతం కోదండరాంకు ఏమీ మిగిలి లేకుండా ఉంది. టీజేఎస్ ను నమ్ముకొని ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు సైలెంట్ అయిపోయి తమ పొలిటికల్ కెరీర్ కోసం ప్రత్యామ్మాయం ఆలోచిస్తున్నారు. కోదండరాంను నమ్ముకొని వారు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టీజేఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో అవమానకర రీతిలో కోలుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కోదండరాంకు రెండే ఆప్షన్లున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తన టీజేఎస్ ను కలిపేసి ఆ పార్టీలో గౌరవంగా కొనసాగడం..లేదంటే గాలికి ఎదురీదుతూ పార్టీని నడిపించడం.. ఇప్పటికే మహాకూటమిలో కోదండరాం కీలకపాత్ర పోషించారు. ఒకవేళ కాంగ్రెస్ లో పార్టీని కలపకపోతే ఉద్యమకారుడిగానైనా కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్యలపై ఓ విజిల్ బ్లోయర్ గా .. సామాజిక కార్యకర్తగా కోదండరాం పాత్ర కొనసాగించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తన గళం వినిపించే అవకాశాలున్నాయి. కానీ కోదండరాంకు ఆ అవకాశం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్న కేసీఆర్ సర్కారు..తనకు వ్యతిరేకంగా పనిచేసిన కోదండరాం విషయంలోనూ అంత ఉదాసీనంగా వ్యవహిస్తుందనుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు.