Begin typing your search above and press return to search.
కోదండరాం మళ్లీ అదే పని చేశారు
By: Tupaki Desk | 18 Jan 2016 4:16 PM GMTతెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి అట్టుడుకిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ఇటు భాగ్యనగరంలో రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరింత నిప్పును రాజేసింది. దీనిపై సీఎం కేసీఆర్ కూతురు కవిత స్పందించడం, అందులోకి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లాగడంతో ఆత్మహత్య రాజకీయ రంగును పులుముకుంది. తాజాగా ఈ వివాదంలోకి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వచ్చిచేరారు.
కోదండరాం తాజాగా మీడియాతో మాట్లాడుతూ...రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఇమడలేకపోవడానికి గల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైన మిగతా విద్యార్థులపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గడ్డమీద జరిగిన ఉదంతంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కోదండరాం ప్రశ్నించడం వివాదాన్ని మరింత పెంచుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.