Begin typing your search above and press return to search.
ప్రజలకోసమే 'తెలంగాణ జనసమితి': కోదండరాం!
By: Tupaki Desk | 2 April 2018 11:58 AM GMTతెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువుడుతోన్న సంగతి తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ కోదండరాం సోమవారం తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ``తెలంగాణ జనసమితి``ని స్థాపిస్తున్నట్లు కోదండరాం సోమవారం నాడు ప్రకటించారు. అంతేకాకుండా, 2019లో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేయబోతోందని, మరే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణలో....సీఎం కేసీఆర్ పాలనతో విసిగిపోయామని, అందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
ఏప్రిల్ 4న ``తెలంగాణ జనసమితి`` జెండా ఆవిష్కరణ చేస్తామని, 5 నుంచి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని, 29న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయబోతున్నామని కోదండరాం వెల్లడించారు. ఆ పార్టీ జెండాలో తెలుపు - నీలం - పచ్చ రంగులతో పాటు అమరవీరులు - కార్మికులు - రైతుల చిహ్నాలు ఉండబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఏప్రిల్ 29 న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం - ఎన్టీఆర్ స్టేడియం, పరేడ్ గ్రౌండ్స్ లలో ఒక చోట సభను నిర్వహించాలని కోదండరాం యోచిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సభకు కొంతమంది జాతీయ నాయకులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రైతు సంఘాల నాయకులు, సామాజికవేత్తలను కూడా కోదండరాం ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.