Begin typing your search above and press return to search.
కోదండరాంకు తొలి ఓటమి ఇది
By: Tupaki Desk | 20 Nov 2018 4:17 AM GMTకొండంత రాగం తీసి.. పనికిరాని పాట పాడినట్టు తయారైంది పొలిటికల్ ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి..! ఎంతో మందికి పొలిటికల్ పాఠాలు నేర్పిన ఈ సారుకు... నిజమైన పాలిటిక్స్ అంతుచిక్కని స్థితికి చేరాయి. తెలంగాణ జనసమితి (టీజేఎస్) నేత ప్రొఫెసర్ కోదండరాంకు తొలి బహిరంగసభలోనే తీవ్ర పరాభవం ఎదురైంది. పార్టీ పెట్టిన నాటి నుంచి రోజూ మీడియా ముందు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న కోదండరాం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సోమవారం తొలిసారి బహిరంగసభ నిర్వహించారు. దుబ్బాక టీజేఎస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఈ సభ జనంలేక వెలవెలబోయింది. కనీసం వందమంది ప్రజలు కూడా హాజరుకాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. కేవలం పదుల సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి కోదండరాం ప్రసంగిస్తూ.. టీజేఎస్ ఆవిర్భావం చారిత్రాత్మకమని డాంబికాలు పలకడం కొసమెరుపు.
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నేతల దెబ్బకు కోదండరాం సార్ గందరగోళంలో పడ్డారనే టాక్ ఉన్న సంగతి తెలిసిందే. కోరుకున్నన్ని సీట్లు సాధించడం మాట పక్కన బెడితే…అసలు తన సీటుకే దిక్కు లేకుండా పోయింది. జనగామ టిక్కెట్ ఆయనకు ఇచ్చినట్టే ఇచ్చిన కాంగ్రెస్… వెనక్కు లాగేసుకుంది. వ్యూహాత్మకంగా బీసీల అస్త్రాన్ని ప్రయోగించింది. అత్యంత చాకచక్యంగా కోదండరాంను వాడుకుని కూరలో కరివేపాకులా తీసిపారేసింది. కాంగ్రెస్ పార్టీ తమకు అక్కరకొస్తుందనుకున్నారు కోదండరాం… కానీ కోదండరాంను వాడుకుందాం అనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే పొలిటికల్ ప్రొఫెసర్ లాజిక్ మిస్సయ్యారు. కూటమి కట్టిన ఆరంభంలో ఇదిగో అదిగో అంటూ టీజేఎస్ ను చర్చల్లో ముంచింది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థులను ప్రకటిద్దామని ఊరించింది. రోజులు గడిచే కొద్దీ బేరసారాలతో మరో రెండు మూడు సీట్లు పెరుగుతాయని కోదండ అండ్ కో ఆశించారు. కానీ ఓ అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ ఏకంగా తమ తొలి జాబితాను ప్రకటించేసి కోదండరాంకు షాకిచ్చింది.
ఇలా కాంగ్రెస్ ఇస్తున్న షాకుల నుంచి తేరుకునేలోగానే పుణ్యకాలం గడిచిపోయిందని అంటున్నారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం వచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు. దాని ఫలితమే తాజాగా జరిగిన సభకు వందల్లో హాజరు అని వివరిస్తున్నారు. భారీ సభ అని ప్రకటించి ఇలా వందలోపు మందితో ముగిసిపోవడం కోదండరాం వైఫల్యంలో ఓ భాగమని పేర్కొంటున్నారు.