Begin typing your search above and press return to search.
మర్చిపోయినట్లున్నారు..వీటి సంగతేంది కేసీఆర్?
By: Tupaki Desk | 30 April 2018 7:30 AM GMTఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైం ఉన్న వేళ ఒక అధికారపక్షం ప్లీనరీ నిర్వహిస్తే తక్కువలో తక్కువ రెండు రోజుల పాటు నిర్వహిస్తుంది. ఒకవేళ అలా చేస్తే.. అది టీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం కాదు. తాను ఇప్పుడు మొదలు పెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లటానికి ఒక పెద్ద వేదిక కావాలి. ఫెడరల్ పేరుతో సభ పెట్టి.. తానొక్కడే మాట్లాడితే అస్సలు బాగోదు. పొగిడే నోరు కూడా తిట్టి పోస్తుంది. నీ వెంట వచ్చే వారు ఎవరని ప్రశ్నిస్తుంది.
అందుకే.. అలాంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు మాస్టర్ మైండ్ కేసీఆర్ భారీ ప్లాన్ వేశారు. దాని ఫలితమే ఒకరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాల్ని శాసించేందుకు పార్టీ నేతల ద్వారా ఏకగ్రీవంగా అనుమతి పొందిన కేసీఆర్.. తన ప్రసంగానికే భారీ ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రసంగంలోనూ తెలంగాణలో తమ సర్కారు సాధించిన విజయాల కంటే.. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో తానేం చేయాలనుకుంటున్న విషయాల్ని ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ను తాను ఎందుకు తెర మీదక తెచ్చిన విషయాన్ని అదే పనిగా చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తమ సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేయటమేకాదు.. ఇచ్చిన హామీలకు మించి మరీ పనులు చేసినట్లుగా చెప్పుకున్నారు.
మరి.. కేసీఆర్ మాటల్లో నిజమెంత? పెద్ద మనిషిగా కుర్చీలో కూర్చొని సుద్దులు చెప్పే రాజకీయ నేత పాలన ఎలా ఉంది? అన్ని చేసేశామని చెప్పే దాన్లో నిజమెంత అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఒకవేళ.. మేం కానీ సందేహాలు వ్యక్తం చేస్తే.. ఏదో ఒక ముద్ర వేయటం ఖాయం. అందుకే.. ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి.. కొత్తగా పెట్టిన పార్టీకి అధ్యక్షుడి పగ్గాలు అందుకున్న కోదండం మాష్టారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధల లిస్ట్ చెప్పుకొచ్చారు. మరి.. ఇవన్నీ చూసిన తర్వాత అయినా కేసీఆర్ తన ప్రకటనను వెనక్కి తీసుకుంటే మంచిది. లేదంటే.. ఆయన్ను గజనీ అనుకునే ప్రమాదం ఉంది.
ఇంతకీ కోదండం మాష్టారు సంధించిన ప్రశ్నల్ని చూస్తే..
+ పిల్లలకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
+ ఇప్పటి వరకు 15 వేలు భర్తీ చేశామంటున్నా అందులో 10 వేలు పోలీసు ఉద్యోగాలే. ఉద్యోగాల భర్తీకి కేలండర్ ప్రకటించాలన్నాం. అదేం జరగలేదు.
+ చిన్న కంపెనీలు పెట్టి - స్థానికులకు ఉద్యోగాలివ్వాలని కోరాం. అదేమీ కాలేదు.
+ మూతపడిన నిజాంషుగర్స్ - సిర్పూర్ పేపర్ మిల్స్ - రేయాన్స్ ను తెరిపించలేదు.
+ పంటలకు గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి ఊసే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తెలంగాణ వచ్చాక రైతులు ఆత్మహత్య చేసుకోవటం ఏంది?
+ రైతులకు ప్రభుత్వమిచ్చే రూ.4 వేలు సమస్యను తీర్చలేదు. కౌలురైతులు - సాదాబైనామాలు - ప్రభుత్వ - అటవీ భూముల్లోని పేద రైతులకు పైసలు రావు.
+ రైతుల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 పెంచితే కొంత న్యాయం జరిగేది. కానీ ఎందుకు ఇవ్వమంటున్నారు?
+ రుణమాఫీ రాలేదు.
+ ఆంధ్రాలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులను ఇప్పటికీ తీసుకురాలేదు. కారణమేమిటంటే ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయలేదట.
+ డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదు. ఇలంటివెన్నో సమస్యలున్నాయి.