Begin typing your search above and press return to search.

పావలా జీవితం గురించి చెప్పిన కోదండరాం

By:  Tupaki Desk   |   8 Jun 2016 4:40 AM GMT
పావలా జీవితం గురించి చెప్పిన కోదండరాం
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తమదైన ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత కూడా పరిస్థతుల్లో మార్పులు రాకపోవటాన్ని.. అభివృద్ధిలో ఎలాంటి మార్పు లేకపోవటాన్ని ప్రస్తావిస్తూ మూడు రోజుల క్రితం తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలంగాణ సర్కారుపై విమర్శలు సంధించటం.. దీనికి ప్రతిగా తెలంగాణ అధికారపక్ష నేతలు విరుచుకుపడటం.. ప్రతి విమర్శలతో ఠారెత్తించటం తెలిసిందే. తెలంగాణ అధికార సభ్యులకు.. కోదండరాంకు మధ్యన మాటల యుద్ధం జరుగుతున్నట్లుగా పలువురు అభివర్ణిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఆయన రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే విషయాన్ని ఆయన్ను కలిసిన మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన కోదండరాం.. మూడొంతుల జీవితం గడిచిపోయిందని.. పావలా జీవితం మాత్రమే మిగిలి ఉందని.. ఆ జీవితాన్ని తెలంగాణ కోసమే వెచ్చిస్తానని.. అభివృద్ధి తప్పించి మరింకేమీ తనకు అక్కర్లేదని స్పష్టం చశారు.

ప్రజల పక్షాన నిలుస్తూ.. వారి సమస్యల మీద పోరాడటమే తన లక్ష్యంగా చెప్పిన కోదండరాం.. టీజేఏసీ రాజకీయ సంస్థ కాదని.. ప్రజలకు మేలు చేసే సంస్థ మాత్రమేనంటూ స్పష్టత ఇవ్వటం గమనార్హం. తెలంగాణ అభివృద్ధి తప్పించి తనకెలాంటి కోరికలు లేవన్న ఆయన.. తెలంగాణ కోసం రాజకీయ పార్టీలన్నింటిని ఏకతాటి మీదకు తీసుకొచ్చింది జేఏసీనే అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే సింగరేణి ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓపెన్ కాస్ట్ ల మీద లాంటి మార్పు లేకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలన్నింటిని జేఏసీ ఒక తాటి మీదకు తీసుకొచ్చిందని కోదండరాం చెబితే.. అసలు కోదండరాంను తెర మీదకు తెచ్చింది తామేనంటూ టీఆర్ ఎస్ నేతలు చెబుతున్న మాటలపై మాష్టారు రియాక్ట్ కావాల్సి ఉంది.