Begin typing your search above and press return to search.
ఒకే వేదికపైకి రేవంత్, కోదండరాం
By: Tupaki Desk | 2 Dec 2016 4:06 AM GMTసిద్ధాంత పరంగా ఒకింత వైరుద్యం ఉన్న తెలుగుదేశం పార్టీ - తెలంగాణ జేఏసీలు ఏకతాటిపైకి వచ్చాయి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం - టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వేదికపైకి రావడమే కాకుండా టీఆర్ ఎస్ సర్కారుపై ఒకే తరహాలో విమర్శలు గుప్పించారు. ఇదంతా జయశంకర్ జిల్లా ములుగులో జరిగిన నూతన జిల్లా సాధన బహిరంగ సభ వేదికగా సాగింది. ములుగు ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉందని, మొదటి దశలోనే జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు - అవసరం ఉందని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా వెనకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ - ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ములుగు ప్రాంతం ఏజెన్సీ - ఆదివాసీ ప్రాంతమని - ఈ ప్రాంత ప్రజలు అణగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందేనని కోదండరాం డిమాండ్ చేశారు.
జిల్లా కోసం ములుగు వాసులు పోరాటం చేయడంలో న్యాయముందని కోదండరాం అన్నారు. భూపాలపల్లిని జిల్లాగా చేయడం సరైంది కాదనడంలో వాస్తవం లేదని, ఒకరిపై నింద వేయడం కన్నా మన ప్రాంత అభివృద్ధి కోరడం మంచిదన్నారు. ఈ ప్రాంతంలో ఖనిజ - నీటి సంపద - పర్యాటక కేంద్రాలు - కాకతీయుల కట్టడాలు - పుణ్య క్షేత్రాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ములుగును మొదటి దశలోనే జిల్లాగా ప్రకటించి ఉండాల్సింది అన్నారు. మల్లంపల్లి గ్రామాన్ని - మంగపేట మండలంలోని రాజుపేటను కూడా మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయ కుట్రవల్లే ములుగు జిల్లా కాలేదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు అనుకూలంగా నేడు టీఆర్ ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించడం లేదన్నారు. సమ్మక్క-సారలమ్మల పేరుతో ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తానని 2008లో ఎందుకు ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలు - డివిజన్ లు - మండలాలు సహేతుకంగా లేవన్నారు. జిల్లాలను ఏ ప్రతిపాదికన ప్రకటించారో అర్థం కాని పరిస్థితిలో ఉందని - అందుకే అసెంబ్లీని ఏర్పాటు చేయడం లేదని అసెంబ్లీలో నిలదీస్తారనే భయం పట్టుకుందని అన్నారు. కొన్ని జిల్లాలు జనాభా ప్రతిపాదికన లేవని, సిరిసిల్ల జిల్లాలో 6 లక్షల 40 వేల జానాభాతో, మెడ్చల్ 25లక్షలతో, హైదరాబాద్ 40లక్షలతో జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యాలు ఏ ఒక్కటి లేవన్నారు. కొన్ని జిల్లాలను ఊడిగం చేసేవారి కోసం, కొన్ని జిల్లాలు రాజకీయపరంగా, కొన్ని జిల్లాలు అడగకుండా, కొన్ని జిల్లాలు అడిగితే ఇచ్చారని ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ.. జెండాలు పక్కనపెట్టి జిల్లా సాధనకు అందరూ కలిసి ఉద్యమిం చాలన్నారు. ములుగును జిల్లా చేయించలేని మంత్రి చందూలాల్ తన కొడుకుకు మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారని విమర్శించారు. జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ సభలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ - ప్రజా గాయకులు విలమక్క సైతం పాల్గొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/