Begin typing your search above and press return to search.
కూల్చటానికి ముహుర్తాలు చూస్తారా కేసీఆర్?
By: Tupaki Desk | 6 Sep 2018 6:22 AM GMTవాస్తు.. జాతకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నమ్మకాలు కూసింత ఎక్కువేనన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నమ్మకాలపైనే పంచ్ లు విసిరారు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండం మాష్టారు.ముందస్తు ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ తీరును ఆయన తప్పు పట్టారు.
ఏదైనా మంచి పని చేయటానికి ముహుర్తాలు చూస్తారేకానీ.. సాఫీగా సాగుతున్న అసెంబ్లీ రద్దుకు ముహుర్తాలు చూస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కారు ఒక్క మంచి పనైనా చేసిందా? అని ప్రశ్నించిన ఆయన.. ఒక్కరితోనైనా మంచి చేశారని అనిపించగలరా? అంటూ సవాలు విసిరారు. బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోదండం ముందస్తుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
తమ పార్టీని రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించిందని.. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ముందస్తు ఎన్నికల కారణంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన కోదండం మాష్టారు పాతిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలంగాణ జనసమితి కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ నెల 20 లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పిన ఆయన.. తాము బలపడటానికి పొత్తుల గురించి మాట్లాడతామన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. కేసీఆర్ పై కోదండం మాష్టారు వేస్తున్న చురకల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఇక.. అసెంబ్లీ రద్దు అయి.. సీఎం కాస్తా అపద్ధర్మ సీఎంగా మారిన తర్వాత ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.