Begin typing your search above and press return to search.
కోదండం నోట సర్కారుపై పోరుబాట అంటే..?
By: Tupaki Desk | 8 Jun 2016 8:42 AM GMTతిరుగులేని అధికారాన్ని చెలాయిస్తూ ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి అసలుసిసలు సవాలు ఎదురైనట్లే. తాజాగా తెలంగాణ రాజకీయ జేఏసీఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తమ పోరుబాట సాగుతుందని స్పష్టం చేయటమే దీనికి నిదర్శనం. గడిచిన రెండురోజులుగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు.. తెలంగాణ అధికారపక్షానికి సాగుతున్న మాటల యుద్ధం తాజా నిర్ణయంతో మరో ములుపు తిరిగినట్లుగా చెప్పాలి.
బుధవారం ఉదయం సమావేశమైన తెలంగాణ రాజకీయ జేఏసీ.. తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించటంతో పాటు.. హామీల అమలు విషయంలో కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి చేస్తామని కోదండరాం స్పష్టం చేవారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జేఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ సర్కారుపై అదే పనిగా విమర్శలతో ఠారెత్తించకుండా.. సంయమనంతో వ్యవహరిస్తూ కోదండరాం వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తామని చెబుతూనే.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాగు.. సాగు నీటి విధానాలు మంచివేనని పేర్కొన్నారు. అవాంతరాలు ఎన్ని ఎదురైనా ప్రజల తరఫున పోరాడతామని.. తమపై దాడులు జరిగినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.
పోలీసులతో ప్రైవేటు విద్యా సంస్థల మీద దాడులు చేయించటం సరికాదన్న కోదండరాం.. విశ్వవిద్యాలయాల అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్కూల్ ఫీజుల విషయంలోనూ మరరో సెమినార్ నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. యూనివర్సిటీలకు ఇప్పటివరకూ వీసీల్ని నియమించలేదన్న కోదండరాం జేఏసీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. కోదండరాం తాజా మాటలు చూస్తే.. రానున్న రోజుల్లో కేసీఆర్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.