Begin typing your search above and press return to search.
కోదండం మాష్టారి పంచ్ అదిరిందిగా
By: Tupaki Desk | 11 Aug 2016 6:04 PM GMTతెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఎలాంటి రాజకీయ పదవుల్ని చేపట్టకుండా ఉద్యమ నాయకుడిగా నిలిచిన కీలక నేతల్లో ఒకే ఒక్కడు ప్రొఫెసర్ కోదండరాంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి మరెలాంటి అంశాల మీద దృష్టి పెట్టని ఆయన తీరును.. తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్ మెంట్ ను వేలెత్తి చూపించే వారెవరూ ఉండరనే చెప్పాలి. అలాంటి కోదండరాం గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో పాటు.. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ తీరును కోదండరాం తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ సందర్భంగా కాసింత ఘాటుగానే కేసీఆర్ సర్కారు మీద విమర్శలు చేస్తున్నారు. అనుకున్న దాని కంటే కోదండం మాష్టారి మాటల తీవ్రత పెరిగిన నేపథ్యంలో.. ఆయనపై తెలంగాణ అధికారపక్షనేతలు ప్రతి విమర్శలు చేస్తూ వాతావరణాన్ని మరింత హీటెక్కించారు.
కోదండరాంపై తొందరపడి విమర్శలు చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో ఆయనపై విమర్శలు చేసేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కోదండం మాష్టారు సైతం ప్రతి చిన్న విషయం మీదా విరుచుకుపడకుండా.. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సమయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపుతుందన్న విషయం తెలిసిందే. మొన్నటివరకూ కరుడగట్టిన నేరస్తుడి ఎన్ కౌంటర్ గా ఉన్నప్పటికీ.. ఈ రోజు (గురువారం)న అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని అదో రాజకీయ అంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై తాజాగా కోదండం మాష్టారు గొంతు విప్పారు. నయిం కేసులో సమగ్ర విచారణ జరపాలన్న ఆయన.. నయిం డైరీలో ఉన్న వివరాలపై పూర్తి విచారణ జరపాలన్నారు. నేరస్తులతో రాజకీయ నేతలు సన్నిహితంగా ఉండటం సరికాదన్న ఆయన.. తెలంగాణ జేఏసీ మీద నిఘా పెట్టే కన్నా.. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులపై నిఘా పెడితే బాగుంటుందంటూ ఏ మాట మాట్లాడితే సూటిగా తగులుతుందో అదే మాటతో చురుకు పుట్టించేలా వ్యాఖ్యానించారు. టీ జేఏసీ కార్యకలాపాలన్నీ బహిరంగంగానే ఉంటాయన్నారు. నయిం ఇష్యూ సంగతేమో కానీ.. టీ జేఏసీ మీద తెలంగాణ ప్రభుత్వం నిఘా కన్ను వేసిందన్న మాటను కోదండం మాష్టారు సందర్భానుసారంగా చెప్పటం గమనార్హం.