Begin typing your search above and press return to search.

అర్చ‌కుల స‌మ్మెకు మాష్టారి అండ‌!

By:  Tupaki Desk   |   26 Aug 2015 11:18 AM GMT
అర్చ‌కుల స‌మ్మెకు మాష్టారి అండ‌!
X
సమ్మె మీద స‌మ్మె తెలంగాణ స‌ర్కారు మీద విరుచుకుప‌డుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల స‌మ్మెతో త‌లబొప్పి క‌ట్టిన ఉదంతం టీ స‌ర్కారుకు ఓ ప‌క్క వెంటాడుతుండ‌గా.. మ‌రోవైపు మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మెపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి వేదిక మీద స‌మ్మె చేస్తున్న వారి తీరును త‌ప్పు ప‌డుతున్న కేసీఆర్‌ కు తాజాగా తెలంగాణ వ్యాప్తంగా అర్చ‌కులు స‌మ్మె పోటు మొద‌లైంది.

త‌మ న్యాయ‌మైన కోర్కెల సాధ‌న కోసం.. అర్చ‌కులు స‌మ్మె చేయ‌టం తెల‌సిందే. అర్చ‌కులు.. ధ‌ర్మ‌క‌ర్త‌లు.. సిబ్బందికి వేత‌నాలు ట్రెజ‌రీ ద్వారా చెల్లించాల‌న్న డిమాండ్ తో పాటు మ‌రిన్ని అంశాల మీద స‌మ్మె చేస్తున్న అర్చ‌కుల‌కు పెద్ద అండ‌గ దొరికిన‌ట్లు అయ్యింది. తాజాగా అర్చ‌కుల స‌మ్మెకు తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం సంఘీభావం తెలిపారు.

అర్చ‌కుల‌వి న్యాయ‌మైన కోర్కెల‌ని.. వాటిని ప‌రిష్క‌రించాల‌ని తెలంగాణ స‌ర్కారును ఆయ‌న కోరారు. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల్నిపాటించి ఉంటే అస‌లీ స‌మ‌స్య వ‌చ్చేది కాద‌న్న ఆయ‌న‌.. ప్ర‌భుత్వం త‌న తీరును మార్చుకోవాల‌ని లేదంటే స‌మ్మె మ‌రింత ఉధృతం అవుతుంద‌ని తెలంగాణ స‌ర్కారుకు హెచ్చ‌రిక చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రోక్షంగా కేసీఆర్‌ కు మ‌ద్ధ‌తు ప‌లికిన కోదండ‌రాం ఈ మ‌ధ్య‌న తెలంగాణ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌డుతూ త‌ర‌చూ మాట్లాడుతున్నారు. తాజాగా.. అర్చ‌కుల విష‌యంలోనూ ఆయ‌న గ‌ళం విప్ప‌టం.. వారికి క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మ‌రి.. అర్చ‌కుల స‌మ్మెకు తెలంగాణ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.