Begin typing your search above and press return to search.

కేసీఆర్ సెంటిమెంట్‌ తోనే ఆయ‌న‌కు షాకిస్తారట‌

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:22 AM GMT
కేసీఆర్ సెంటిమెంట్‌ తోనే ఆయ‌న‌కు షాకిస్తారట‌
X
ఉద్య‌మ‌వేదిక‌గానే ఉంటామ‌ని ముందు ప్ర‌క‌టించినప్ప‌టికీ అనంత‌రం రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసి అందుకు సార‌థ్యం వ‌హిస్తున్న తెలంగాణ జేఏసీ మాజీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం..త‌న ల‌క్ష్యానికి త‌గిన వ్యూహాల‌ను ఒకింత వేగంగానే అమ‌లు చేస్తున్నారు.ఇందులో భాగంగా విభిన్న‌మైన ప్ర‌ణాళిక ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సెంటిమెంట్‌ పై దెబ్బ కొట్ట‌డం - ఆయ‌న వ‌ల్ల అప్‌సెట్ అయిన వారిపై ఫోక‌స్ పెడుతోంది. టీఆర్ ఎస్‌ లో అసంతప్తితో ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకుగాను ఇప్పటికే కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులను పూర్తి చేసి గ్రామాలకు పంపించింది. గ్రామాల్లో సభ్యత్వ నమోదు - పార్టీ లక్ష్యాల వ్యాప్తి కోసం ప్రచార రథాలను గ్రామాల్లోకి పంపిస్తున్నది. ఈ రథాల ద్వారా కార్యకర్తలు గ్రామ - గ్రామాలకు వెళ్లి టీజేఎస్‌ లక్ష్యాలను - తెలంగాణ ఉద్యమం ద్వారా సాధించిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నేరవేరాయి? వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరపత్రాలు ముద్రించి ప్రచార రథాల ద్వారా పల్లెలకు చేరుస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దష్టి సారిస్తూనే ప్రభుత్వ పథకాల అమలుపై వాటిలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపేందుకు వీలుగా సర్వే చేస్తున్నారు.

రాష్ట్రంలో పట్టు సాధించేందుకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కేసీఆర్‌ కు సెంటిమెంట్‌ గా ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాగా వేయాలని - జిల్లా పరిధిలో పార్టీ విస్తరణపై టీజేఎస్‌ నేతలు ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. కేసీఆర్‌ కు న‌చ్చిన చోటే ఆయ‌న్ను దెబ్బ‌కొడితే...త‌ర్వాత పార్టీకి ఊపువ స్తుంద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు అధికార టీఆర్ ఎస్ పార్టీలో పదవులు దక్కనివారిని, ఇతర పార్టీల్లో ఉంటూ టీజేఎస్‌ పట్ల మొగ్గు చూపుతున్న వారిని గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - వరంగల్‌ వంటి ఉమ్మడి జిల్లాల పరిధిలోని కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇచ్చి వారిని ఆయా గ్రామాలకు పంపించారు. అంతేకాకుండా, పార్టీలో సంస్థాగత నిర్మాణంపై దష్టి సారిస్తూనే ప్రభుత్వ పథకాల అమలుపై వాటిలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపేందుకు వీలుగా సర్వే నిర్వహిస్తున్నారు.

ప్ర‌ధానంగా గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌చారం చేస్తున్న రైతుబంధు పథకంపై సర్వే చేసి వాటిలోని లోపాలను ప్రజలకు వివరిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల తయారీలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం - రైతులు వాటిని తీసుకొని మార్పులు - చేర్పుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీజేఎస్‌ ఈ సర్వేను ఉపయోగించుకుంటున్నది. సర్వే అనంతరం పలు పథకాల అమలుపై కూడా గ్రామాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడంతోపాటు వాటి అమలులో జరుగుతున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని టీజేఎస్‌ ప్రయత్నిస్తోంది. గ్రామాలకు వెళ్లి రైతు కుటుంబాన్ని కలిసి వారికి ఎంత భూమి ఉంది? సొంత భూమా - కౌలుకు తీసుకున్నారా ? పట్టాదారు పాసుపుస్తకం వచ్చిందా ? రైతుబంధు పథకం కింద ఎంత డబ్బు పొందారు ? పట్టాదారు పాసుపుస్తకాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయా ? భూ ప్రక్షాళన కోసం అధికారులు గ్రామాలకు వచ్చారా? క్షేత్రస్థాయి పరిశీలన చేశారా ? భూ ప్రక్షాళన, రైతు బంధు పథకంపై వారి అభిప్రాయాలు ఏమిటి ? తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పథకం పథకం వ్యవసాయ పెట్టుబడుల అవసరాన్ని ఎంత వరకు తీర్చగలుగుతోంది ? అనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. స్థూలంగా... ఇటు కేసీఆర్ పార్టీలోని అసంతృప్తుల‌కు గాలం వేయ‌డం అటు...ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు.