Begin typing your search above and press return to search.
కోదండం సారూ!...కవితతో డీ ఈజీ కాదండీ!
By: Tupaki Desk | 14 March 2019 9:11 AM GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక భూమికే పోషించారు. అప్పటిదాకా టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలోకి విద్యార్థి లోకం పెద్దగా రాలేదనే చెప్పాలి. అయితే నాడు ఉస్మానియా వర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న కోదండరాం ఎప్పుడైదే బరిలోకి దిగారో - విద్యార్థి లోకంతో పాటు మేధావులు కూడా ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మొత్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో కోదండరాందే కీలక భూమిక అని చెప్పాలి. అలాంటి కోదండరాంను టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కరివేపాకులా వాడేశారు. దీంతో అహం దెబ్బ తిన్న కోదండరాం... ఏకంగా తెలంగాణ జన సమితి పేరిట పార్టీ పెట్టారు. ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీల కూటమి మహా కూటమిలో భాగస్వామిగా టీజేఎస్ ఉన్నా... వివిధ కారణాలతో కోదండరాం పోటీకి దిగలేదు. తాజాగా వెలువడ్డ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో కోదండరాం ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీగా పోటీ చేయాలని తీర్మానించుకున్న ఆయన... తనకు గెలుపు అవకాశాశాలున్న నియోజకవర్గం కాకుండా... ప్రత్యర్థి వర్గానికి గట్టి పట్టున్న నిజామబాద్ లాంటి స్థానాన్ని ఆయన ఎంచుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కేసీఆర్ కూతురు కవిత ఉన్నారు. కవిత దెబ్బకు అక్కడ వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్... ఏకంగా నిజామాబాద్ లో తాను ఈ సారి పోటీ చేయలేనని తేల్చేశారు. తనకు భువనగిరి టికెట్ ఇవ్వాలంటూ దాదాపుగా నిజామాబాద్ నుంచి పరారైపోయారు. ఇలాంటి కీలక తరుణంలో కోదండరాం ఏ లెక్కలతో ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఫలితాలను - ఇప్పుడు టీఆర్ ఎస్ కు అనుకూలంగా వీస్తున్న గాలిని లెక్కేస్తే... తెలంగాణలోని 17 సీట్లు కూడా ఆ కూటమికే దక్కే అవకాశాలే అధికమని చెప్పాలి. మరి కోదండం సారు లెక్కేమిటన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
కోదండం మాస్టారి లెక్కల విషయానికి వస్తే... రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ హవా ఉందని కోదండం సారు కూడా నమ్ముతున్నారు. అయితే తాను బరిలోకి దిగితే - ఆ బరికి మహా కూటమి మద్దతు పలికితే... కవిత స్థానమేంటీ? అసదుద్దీన్ స్థానంలో అయినా ఫలితం తారుమారే కదా. అందులోనూ నిజామాబాద్ లో కవిత పట్ల భారీ ఎత్తున వ్యతిరేకత ఉన్నది. విపక్షం నుంచి బలమైన అభ్యర్థి బరిలోకి దిగి... అక్కడి ఓటర్లలోని వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే... టీఆర్ ఎస్ కు ఓటమి తప్పదు. మరి రాష్ట్రంలో మొత్తం 17 సీట్లు ఉంటే... నిజామాబాద్‌నే కోదండం సారు ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? రాష్ట్రంలోని అన్ని సీట్లలో టీఆర్ ఎస్ గెలిచి పార్టీ అధినేత కుమార్తె ఓడిపోతే... ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
నిజమే... విపక్షం బతికి బట్టకట్టలేని ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ లో కవిత ఓడితే.... టీఆర్ ఎస్ పతనం మొదలైనట్టే. విపక్షాలకు బలమొచ్చినట్టే. ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నా... గడచిన ఐదేళ్లలో నిజామాబాద్ ప్రజలతో మమేకం అయిపోయిన కవిత...ప్రజల్లో మంచి ఇమేజీనే సంపాదించుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీగా ఉన్నప్పటికీ... తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా గూడుకట్టుకోకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రౌండ్ రిపోర్ట్ ను తెలుసుకున్న యాష్కీ... అక్కడి నుంచి దాదాపుగా పరార్ అయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కోదండరాం చేస్తున్న ధైర్యం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.