Begin typing your search above and press return to search.
కోదండ పోటీచేసే ఆ రెండు నియోజకవర్గాలు?
By: Tupaki Desk | 1 Aug 2018 7:01 AM GMTతెలంగాణ ఉద్యమంలో వారిద్దరూ కలిసి నడిచారు. కానీ సీఎం కేసీఆర్ గద్దెనెక్కాక ఎందుకో కానీ కోదండరాం దూరమయ్యారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు ఆఫర్ చేసినా కానీ పోటీచేసేందుకు ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోకి రానన్నారు. సరేనని కేసీఆర్ పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. కేసీఆర్ పై కోదండ రాం తిరుగుబాటు మొదలైంది. తెలంగాణ జనసమితి పేరుతో ఓ పార్టీని పెట్టిన కోదండరాం ఇప్పుడు పక్క టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కోదండరాం స్వస్థలం పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ. ఆయన మంచిర్యాల నుంచి పోటీచేయాలని మొదట భావించారు. సింగరేణి కార్మికులతో ఆయనకు మంచి సంబంధాలుండడంతో ఇక్కడ ఈజీగా గెలుస్తానని తొలుత అంచనావేశాడు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓ రెండు నియోజకవర్గాలపై కోదండరాం దృష్టిసారించాడు. అక్కడ పోటీచేస్తే గెలవడం ఈజీ అన్న కోణంలో విశ్లేషిస్తున్నాడట.. ఇంతకీ ఆ రెండు నియోజకవర్గాలు ఏంటంటే..
ఒకటి వరంగల్ పూర్వపు జిల్లాలోని జనగామ.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అప్పట్లో ఈ ఎమ్మెల్యే దూకుడును కలెక్టర్ అడ్డుకుంటే ఆమెతో ఫైట్ కు దిగి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పలు తీవ్రమైన ఆరోపణలు కూడా ఎమ్మెల్యేపై వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డి ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అందుకే కోదండ ఇక్కడ పోటీచేస్తే తాను ఈజీగా గెలుస్తానని భావిస్తున్నాడట.. ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీదారుగా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. మరి కాంగ్రెస్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న కోదండ.. ఒకవేళ పొన్నాల అభ్యంతరం పెడితే వేరే నియోజకవర్గానికి మారిపోవచ్చు.
ఇక కోదండ దృష్టిలో ఉన్న మరో నియోజకవర్గం ఉప్పల్. అత్యధిక విద్యాధికులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా రెండు సార్లు డబ్బులు పంచకుండానే గెలిచారు. కోదండ స్వతహాగా ఉద్యమకారుడు - ఉపాధ్యాయుడు కావడంతో ఇక్కడ పోటీచేస్తే గెలవడం ఈజీ అని భావిస్తున్నాడు.
ఇలా కోదండ తను పోటీ చేసేందుకు ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలపైనే దృష్టిసారించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే మాత్రం అప్పటికి సమీకరణాలు మారిపోవచ్చు.