Begin typing your search above and press return to search.
బాబును హెచ్చరించిన కోదండం మాష్టారు
By: Tupaki Desk | 5 March 2017 5:13 AM GMTరాష్ట్ర విభజన జరగడం - తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చీకటి రోజు అని వ్యాఖ్యానించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వైఖరి వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని విశ్వసించిన చంద్రబాబు తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమని తెలిసిన వెంటనే కుంటి సాకులు చూపించి అడ్డుకోవాలని ప్రయత్నించారని కోదండరాం విమర్శించారు.
ఇపుడు అదే రీతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్ర ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు - సంఘటిత శక్తి త్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న విషయాన్ని బాబు మరిచిపోరాదని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వల్ల సీమాంధ్ర రాజకీయ నాయకుల గుత్తాధిపత్యం పోయి తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరగలేదని, పైగా మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడిందని ఆయన వివరించారు.
పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకుల - పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనేక దశాబ్దాల పాటు అడ్డుపడ్డారని కోదండరాం విమర్శించారు. తెలంగాణపై ద్వేషం కారణంగా అనేక అంశాలపై విభజన ప్రక్రియ నత్తనడకన నడుస్తున్నదని, ఇప్పటికీ పూర్తి కావడం లేదని కోదండరాం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియపై విమర్శలు చేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిపాలకుడిగా సొంత రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణలో కొనసాగుతున్న కొంత మంది సీమాంధ్ర రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల జోక్యాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కోదండరాం తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/