Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై జేఏసీ ఉద్యమానికి కోదండరాం రెడీ

By:  Tupaki Desk   |   7 Oct 2019 12:05 PM GMT
కేసీఆర్ పై జేఏసీ ఉద్యమానికి కోదండరాం రెడీ
X
తెలంగాణ ఆర్టీసీపై కఠిన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం.. కేసీఆర్ మరో తప్పు చేయకు అంటూ హెచ్చరించారు. ప్రజల పట్ల నిరంకుశంగా అహంకార పూరితంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తీరు రాజ్యాంగానికి విరుద్ధమని.. ఆర్టీసీ కార్మికులు న్యాయసమ్మితంగా వ్యవహరిస్తున్నారని కోదండరాం అన్నారు. కార్మికులు జీతాల కోసం సమ్మె చేయడం లేదని.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకురావాలనే చేస్తున్నారని కోదండరాం స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది సొంత జీతాల కోసం కాదని.. కేవలం ఆర్టీసీని ఆదుకోవడానికేనని కోదండం రాం తేల్చిచెప్పారు.

కన్షేషన్లు, బసుపాసుల చెల్లింపులు, రూట్లలో నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కోదండరాం సూచించారు. కానీ కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని కోదండరాం విమర్శించారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ ను కేసీఆర్ పట్టించుకోవడం లేదని కోదండరాం చెప్పుకొచ్చాడు.

ఆర్టీసీ విషయంలో కేసీఆర్ చేస్తున్నది ముమ్మాటికీ తప్పేనని కోదండరాం స్పష్టం చేశారు. అన్ని సంఘాలతో కలిసి త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని.. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని కోదండరాం హెచ్చరించారు.