Begin typing your search above and press return to search.
ఏ ఒక్క చాన్స్ వదులుకోని కోదండ మాస్టారు
By: Tupaki Desk | 1 Dec 2017 3:30 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్‌పై వ్యతిరేక ఎజెండాను ఎత్తుకున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈ క్రమంలో తనకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. డిసెంబర్ 4వ తేదీన కొలువుల కొట్లాట పేరుతో నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక సమర సభ ఏర్పాటు చేసిన జేఏసీ చైర్మన్...ఈ క్రమంలో అనుమతి దక్కేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు అనుమతి దక్కించుకున్న కోదండరాం ఇప్పుడు తదుపరి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఏ ఒక్కచాన్స్ ను కూడా ఆయన వదులుకోవడం లేదు.
తెలంగాణ జేఏసీ తరఫున కొలువుల కొట్లాటను నిర్వహిస్తున్నప్పటికీ...ఈ సర్కారు వ్యతిరేక సభకు అన్ని పక్షాల సహకారం పొందేందుకు ప్రొఫెసర్ కోదండరాం శతవిధాల కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపాక్షాలను కీలక రాజకీయ పార్టీలను ఆయన కలుస్తున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను వారి వారి పార్టీ కార్యాలయాల్లో వేర్వేరుగా కలిశారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆసక్తికరంగా ఇరు పక్షాలు తమ సంఘీభావం తెలపడం గమనార్హం.
ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుందని, కొలువుల కొట్లాట సభకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరగా...జేఏసీ రాజకీయ పార్టీ కాదని కోదండరాం నర్మగర్భంగా స్పందించారు. మరోవైపు కొలువులకై కొట్లాట సభకు తాను కూడా హాజరవుతానని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
కాగా, బీజేపీ నేత లక్ష్మణ్ తో సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ కొలువుల కొట్లాట సభ కోసం ఆహ్వానించగా లక్ష్మణ్ అంగీకరించారని అన్నారు. హైదరాబాద్ లో సభలు పెట్టుకోవడానికి కష్టమైతోంది.. దీనివల్ల చాలా మందికి ఇబ్బంది అవుతున్న విషయంపై దృష్టి పెట్టాలని కోరినట్లు వివరించారు. హైదరాబాద్ లో నిర్బంధ వాతావరణంపైన పట్టించుకోవాలి కోరినట్లు వెల్లడించారు. డిసెంబర్ 4న జరిగే కొలువుల కొట్లాటలో పాల్గొనేందుకు చాలా మంది యువకులు తయారుగా ఉన్నారని పేర్కొంటూ ప్రభుత్వం ఎలాంటి నిర్భంధం విధిస్తుందో చూడాలన్నారు.