Begin typing your search above and press return to search.
ఓడిపోయే సీటిస్తావా..బాబుపై కోడెల ఆగ్రహం?
By: Tupaki Desk | 8 March 2019 6:39 AM GMTఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చంద్రబాబు చెక్ పెడుతున్నారనే వార్తలు వెల్లువలా వస్తున్నాయి... ఓడిపోయే సీటును కోడెలకు కట్టబెడుతున్నారట.? బాబు నిండా ముంచేందుకే కోడెలను ఎంపీ బరిలో నిలుస్తున్నాడనే చర్చ సాగుతోంది. ఎంపీగా పోటీచేయాలన్న బాబు ప్రతిపాదనను కోడెల తిరస్కరించి దీనిపై ఆక్రోశం వెల్లగక్కినట్లు సమాచారం.
సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల ఈ ఐదేళ్లు స్పీకర్ గా కొనసాగారు. సీనియర్ కావడం.. రాజకీయ - సామాజిక సమీకరణాల దృష్ట్యాను కోడెలను స్పీకర్ ను చేశారు బాబు. కానీ ఈసారి కోడెల సత్తెన పల్లి నుంచి బరిలోకి దిగకుండా ఆయన కుమారుడిని బరిలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
అయితే కోడెలను ఖాళీగా ఉంచకుండా నరసారావు పేట ఎంపీ బరిలో దింపేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే నరసారావు పేట నుంచి ప్రస్తుతం రాయపాటి ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో కోడెలను బాబు దించాలనుకుంటున్నారట.
అయితే తాను మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీచేసి మంత్రి పదవి చేపడుతానని.. తనకు ఎంపీ సీటు వద్దని బాబుకు కోడెల స్పష్టం చేసినట్టు వార్తలొస్తున్నాయి. తనకు ఢిల్లీ రాజకీయాలు పడవని.. నాడు ఎన్టీఆర్ ఎంపీగా పోటీచేయాలని కోరినా తాను ఒప్పుకోలేదని బాబు ఎదుట కోడెల స్పష్టం చేసినట్లు సమాచారం.
కోడెల ఇదే నరసరావుపేట నుంచి వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ వరుసగా మూడు సార్లు ఓడింది. అందుకే ఈ ఓడిపోయే సీటును తనకు ఆఫర్ చేసిన బాబు ప్రతిపాదనను కోడెల సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.