Begin typing your search above and press return to search.
బీజేపీని కోడెల ఎన్ని మాటలు అన్నారంటే...
By: Tupaki Desk | 10 Aug 2016 1:33 PM GMTగత ఇరవై రోజులుగా అమెరికాలోని వివిధ పట్టణాలలో పర్యటిస్తూ ప్రవాసాంధ్రులతో మమేకం అవుతున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రత్యేక హోదాపై, ఏపీ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా చికాగోలో పర్యటిస్తున్న కోడెల కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరమైన ధోరణిలో రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టిందని దానికి ఫలితం ఆ పార్టీ అనుభవించిందని విమర్శించారు. పార్లమెంటులో ఆంధ్రా ఎంపీలను కొట్టి, లైట్లు ఆర్పి అర్ధరాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం కూడా నవ్యాంధ్రకు చేయూతనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూ...ప్రత్యేక హోదా ఇస్తేనే నవ్యాంధ్రకు న్యాయం జరుగుతుందని కోడెల వెల్లడించారు.
నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు లేకున్నా ఆ రాష్ట్రాన్ని అన్ని పరిస్థితుల్లో ముందుకు నడిపించగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న చంద్రబాబు నాయకత్వం ఏపీకి ఉందని శివప్రసాద్ గుర్తు చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం వ్యవహరించడం లేదని ఆయన రాజధానిని కుప్పంలో పెట్టుకోలేదని, అన్ని విధాలా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం ఆయన పరిపాలనాదక్షతకు నిదర్శనమని కోడెల ప్రశంసించారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత స్వర్గీయ ఎన్.టీ.రామారావుకు దక్కుతుందని, ఆయన బాటలో నడుస్తున్న చంద్రబాబు తెలుగువారికి మరింత గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం చేపట్టిన చర్యల మూలంగా ఐటీ రంగం హైదరాబాద్‌లో ప్రపంచస్థాయిలో ప్రముఖ స్థానం పొందిందని చాలా మంది యువతీయువకులు విదేశాలకు వెళ్లి మంచి రంగాల్లో స్థిరపడ్డారన్నారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు నవ్యాంధ్ర నవ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, తమకు జన్మనిచ్చిన గ్రామాల అభివృద్దికి సహకరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలబడే సత్తా తెలుగువారికి ఉందని నిరూపించుకోవలసిన తరుణం ఆసన్నమైందని కోడెల స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అపారమైన సహజ సంపద నవ్యాంధ్రలో ఉందని ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని స్పీకర్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు సులభంగా లభిస్తున్నాయని తెలిపారు. ఏపీకి ఉన్న విశాలమైన కోస్తా తీరం , వనరులు వ్యాపార వాణిజ్య రంగాలకు బలమైన పునాదులుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాలో ఏపీకి రెండవ స్ధానం దక్కిందని, ఇది స్వయంగా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్ అని కోడెల గుర్తు చేసారు. రానున్న 15 సంవత్సరాల వ్యవధిలో ఏపీ ప్రతిష్టాత్మక రాష్ట్రంగా రూపుదిద్దుకోనుందని, బాలారిష్టాలను అధికమించేందుకు ప్రవాసాంధ్రుల సహకారం అత్యావశ్యకమని డాక్టర్ కోడెల స్పష్టం చేశారు.