Begin typing your search above and press return to search.

నిజ‌మేనా?.. బాబు కేబినెట్ లోకి కోడెల‌!

By:  Tupaki Desk   |   31 March 2018 9:55 AM GMT
నిజ‌మేనా?.. బాబు కేబినెట్ లోకి కోడెల‌!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్పుడు నిజంగానే ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ మిన‌హా దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఉద్య‌మంలోకి దూకేశాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రానికి అన్యాయం చేసింద‌ని ఎన్డీఏ స‌ర్కారుపై నింద‌లేసిన టీడీపీ ఆ కూట‌మి నుంచి వైదొల‌గింది. ఫ‌లితంగా చంద్ర‌బాబు కేబినెట్ లోని ఇద్ద‌రు బీజేపీ మంత్రులు త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో న‌రేంద్ర మోదీ కేబినెట్ లోని ఇద్ద‌రు టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేశారు. కేంద్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా… రాష్ట్రంలో మాత్రం బీజేపీ మంత్రుల రాజీనామాల‌తో ఖాళీ అయిన కేబినెట్ బెర్తుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బీజేపీ మంత్రుల రాజీనామాల‌తో ఖాళీ అయిన దేవ‌దాయ శాఖ‌ను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి అప్ప‌గించిన చంద్ర‌బాబు… వైద్య‌ - ఆరోగ్య శాఖ‌ను మాత్రం త‌న వ‌ద్దే ఉంచేసుకున్నారు.

అయితే ఇటీవ‌లి కాలంలో విప‌క్ష వైసీపీ దూకుడు పెరిగిపోవ‌డం - మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన కూడా వైరివ‌ర్గంగానే మారిపోయిన నేప‌థ్యంలో… విప‌క్షాల‌కు గ‌ట్టిగానే బ‌దులివ్వ‌గ‌లిగిన నేత కేబినెట్ లో ఉంటే బాగుంటుంద‌ని చంద్రబాబు భావించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ప‌లుమార్లు కేబినెట్ లో సీనియ‌ర్ మంత్రిగా ప‌నిచేసి… ప్ర‌స్తుతం స్పీక‌ర్ గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ ను కేబినెట్ లోకి తీసుకోవాల‌న్న ప‌లువురి సూచ‌న‌ల‌కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. 1983లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కోడెల హోం మంత్రిగా - వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రిగా - భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రిగానూ ప‌నిచేశారు. అంతేకాకుండా కోడెల వ‌చ్చారంటే విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను దీటుగా స‌మాధానం చెప్పే మంత్రి ఉన్నార‌న్న భ‌రోసా కూడా ఉంటుంద‌న్న కోణంలో చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో స్పీక‌ర్ ప‌ద‌వి నుంచి కోడెల‌ను త‌ప్పించేసి ఆయ‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని చంద్ర‌బాబు దాదాపుగా నిర్ణ‌యించిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

కోడెల‌ను మంత్రిగా తీసుకుంటే… మ‌రి స్పీకర్‌ గా ఎవ‌రిని నియ‌మించాల‌న్న అంశానికి సంబంధించి కూడా చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఓ క‌న్‌ క్లూజ‌న్‌ కు వచ్చేసిన‌ట్టుగానే ప్ర‌చారం సాగుతోంది. కోడెల సొంత జిల్లా గుంటూరులోని పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న‌ పార్టీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్రకుమార్‌ కు స్పీక‌ర్ ప‌ద‌వి అప్ప‌గించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం జ‌రిగిపోయింద‌ని టాక్‌. ఇప్ప‌టికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ధూళిపాళ్ల‌… గుంటూరు జిల్లాలోనే కాకుండా టీడీపీలోనూ ప‌రాజ‌యం ఎరుగ‌ని నేత‌గా రికార్డు సృష్టించారు. అయితే సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ధూళిపాళ్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కేబినెట్ బెర్తు అందిన‌ట్టే అంది అదంకుండాపోతోంది. ఈ క్ర‌మంలో పైన చెప్పిన మార్పులు జ‌రిగితే… ధూళిపాళ్ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టుగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.