Begin typing your search above and press return to search.

పాతపగలకు 2019 వేదిక కాబోతోందా.?

By:  Tupaki Desk   |   24 Aug 2018 1:15 PM GMT
పాతపగలకు 2019 వేదిక కాబోతోందా.?
X
గుంటూరు జిల్లాలో కాసు కృష్ణా రెడ్డి ఫ్యామిలీ కేంద్రంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014 నుంచి రాజకీయంగా సైలెంట్ అయిన కృష్ణారెడ్డి తన కుమారుడు కాసు మహేష్ ను పొలిటిలికల్ గా తెరపైకి తెచ్చాడు. వైసీపీలో చేరిన కాసు మహేష్ ను జగన్ సాదరంగా ఆహ్వానించి గురజాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. అప్పటి నుంచి గురజాల కేంద్రంగా పనిచేసుకుంటూ పోతున్నారు మహేష్. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టిన మహేష్ ను నర్సరావుపేట నుంచి పోటీచేయాలని కాసు అనుచరగణం కోరుతోంది. దీంతో కాసు మహేష్ ఎక్కడి నుంచి పోటీచేస్తాడనే సస్పెన్స్ రోజురోజుకు పెరిగిపోతోంది.

నర్సరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సిరెడ్డి వైసీపీ నుంచే గెలిచారు. వైసీపీలోనే కొనసాగుతున్నారు. కానీ కాసు అనుచరగణం మహేష్ వైపు చూడడం ఎందుకా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నర్సారావుపేటలో మూడు దశాబ్ధాలుగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు - కాసు కృష్ణారెడ్డిలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. నర్సారావుపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా కాసు కృష్ణారావు గెలుపొందారు. మంత్రిగాను పనిచేశారు. కానీ 2014 ఎన్నికల్లో కాసు పోటీచేయలేదు. అటు టీడీపీ-బీజేపీ పొత్తులో నరసారావుపేటను కమలానికి వదిలేశారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి గెలుపొందారు కోడెల శివప్రసాద్.. దీంతో దశాబ్దాల కోడెల వర్సెస్ కాసు వైరానికి 2014 ఎన్నికల్లో అనుకోకుండా బ్రేక్ పడింది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కోడెలకు గట్టి పోటీ కాదని అధిష్టానం భావిస్తోంది. అందుకే కాసు మహేష్ ను బరిలోకి దింపాలని కాసు వర్గం గట్టిగా కోరుతోంది.

వచ్చే ఎన్నికల్లో నరసారావు పేట నుంచి కోడెల కానీ ఆయన కుమారుడు కానీ పోటీచేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోందట.. కోడెల కు చెక్ చెప్పేందుకు గోపిరెడ్డి కంటే కాసు మహేష్ గట్టి పోటీ అవుతాడని క్యాడర్ భావిస్తోంది. కానీ గురజాల ఇన్ చార్జిగా మహేష్ ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు. అందుకే ఇప్పుడే మహేష్ ను నరసారావుపేటకు మార్చాలని క్యాడర్ కోరుతోందట.. చివరి నిమిషంలో పంపితే ప్రయోజనం ఉండదంటున్నారు.

ఇవన్నీ గమనిస్తే కాసు వర్సెస్ కోడెల వార్ మళ్లీ నరసారావుపేటలో జరిగే చాన్స్ ఉందంటున్నారు. కాసు మహేష్ తొందరగా నిర్ణయిస్తే రెండు నియోజకవర్గాల్లోనూ క్యాడర్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.