Begin typing your search above and press return to search.

మమ్మల్ని బతుకనివ్వండి: కోడెల కుమార్తె

By:  Tupaki Desk   |   17 Sept 2019 11:27 AM IST
మమ్మల్ని బతుకనివ్వండి: కోడెల కుమార్తె
X
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనంగా మారింది. ఆయన మృతిపై రాజకీయం మొదలైంది. వైసీపీ వల్లేనని టీడీపీ.. లేదు లేదు.. కొడుకు, కూతురు వేధింపుల వల్లేనని వైసీపీ ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియాలో దీనిపై ఎవరి వాదన వారు వినిస్తున్నారు.

దీంతో ఈ ప్రచారంపై తాజాగా కోడెల శివప్రసాద్ రావు కుమార్తె మీడియా ఎదుట బోరుమన్నారు. కన్నీరుమున్నీరయ్యారు. కోడెల మృతిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన కుతురు విజయలక్ష్మీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ తండ్రి గురించి రకరకాల ఆరోపణలు చేయొద్దంటూ చేతులు జోడించి ఏడుస్తూ అందరికీ విజ్ఞప్తి చేశారు.

కొడుకు - కూతురు వల్లే కోడెల చనిపోయాడంటూ ప్రచారం చేయడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. తండ్రి అంటే ప్రాణమని.. ఆయన చాటు బిడ్డలుగా ఎదిగామని.. మాపై చెడు ప్రచారం చేయబద్దంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మీ వాపోయారు.

చనిపోయిన వ్యక్తి మీద అభాండాలు వేయొద్దని.. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని విజయలక్ష్మీ కన్నీళ్లతో మీడియా ఎదుట వేడుకున్నారు. మూడు నెలలుగా ఆయనను వేధించారని.. ఆయన ఆత్మకైనా శాంతి కలుగనివ్వండి అంటూ ఆమె ప్రాథయపడ్డారు.