Begin typing your search above and press return to search.

కోడెల అసంతృప్తి...వెంక‌య్య పిలుపు

By:  Tupaki Desk   |   27 Nov 2016 10:42 AM GMT
కోడెల అసంతృప్తి...వెంక‌య్య పిలుపు
X
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కోడెల అన్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం స‌రైన‌ద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ అమ‌లులో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయ‌ని తెలిపారు. గుంటూరులో కోడెల శివ‌ప్ర‌సాద్ రావు మీడియాతో మాట్లాడుతూ 20 మంది బడాబాబుల నల్లధనం అరికట్టడం కోసం 80 మంది సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి రావడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చిన్న నోట్లను అందుబాటులోనికి తీసుకువచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని ఆయన అన్నారు.

ఇదిలాఉండ‌గా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజ‌మండ్రిలో మీడియాలో మాట్లాడుతూ నోట్ల ర‌ద్దును వ్య‌తిరేకించే వారికి నల్లధనం వెలికి తీస్తుంటే తట్టుకోలేక ఆక్రోశం వ‌స్తుందా అని ప్ర‌శ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరిస్తున్న అభినవ సంస్కర్త ప్రధాని మోడీ అని కొనియాడారు. మోడీకి పెరుగుతున్న జనాదరణను జీర్ణించుకోలేకపోతున్న వారు. నల్లధనం వెలికితీసే ధర్మయుద్ధాన్ని ఆపడానికి బంద్‌కు పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నోట్ల ర‌ద్దును తెలుపుతు నవంబర్‌ 8న తీసుకున్నది ఆకస్మిక నిర్ణయం కాదని పేర్కొన్నారు. రేపటి బంద్‌ను తిరస్కరించాలని ప్రజలకు వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు.

మ‌రోవైపు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మపాలలో టీడీపీ జనచైతన్య యాత్రలో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. జనచైతన్యయాత్రలో ఎడ్లబండిపై వెళ్తుండగా ఎద్దులు బెదిరిపోవడంతో అయ్యన్నపాత్రుడు కిందపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించడంతో మంత్రికి ప్రమాదం తప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/