Begin typing your search above and press return to search.
పోస్ట్ మార్టం రిపోర్ట్..లుంగీ తెగితే - వైరుతో ఉరేసుకున్న కోడెల
By: Tupaki Desk | 18 Sep 2019 4:49 PM GMTటీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఇక తనకు చావే దిక్కు అని తీర్మానించేసుకున్న కోడెల... ఆత్మహత్యాయత్నంలో ఓ సారి విఫలమైతే... ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వెనువెంటనే రెండో సారి ఆత్మహత్యాయత్నం చేసుకుని ప్రాణాలు వదిలారు. తొలుత లుంగీతో కోడెల ఉరి బిగించుకుంటే... ఆ లుంగీ వస్త్రం కోడెల బరువుకు తట్టుకోలేక తెగిపోయిందట. వేరే ఎరవైనా అయితే అక్కడితో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకునే వారే. అయితే కోడెల... తనను తాను చంపేసుకోవడానికే సిద్ధమై... లుంగీ తెగితే ఏం... పక్కనే వైరు ఉంది కాదా అని వైరుతో ఉరేసుకున్నాడట. తొలి యత్నంలో గుడ్డ ముక్క తెగి ప్రాణాపాయం తప్పించుకున్న కోడెల... రెండోసారి మాత్రం గట్టిగా ఉండే వైరుతో ఉరేసుకుని ప్రాణాలు వదిలాడట. ఈ మేరకు కోడెల పోస్ట్ మార్టం నివేదిక తేల్చేసింది.
హైదరాబాద్ లోని తన ఇంటిలో మొన్న ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కాస్త ఆలస్యంగా మేల్కొన్న ఆయన కుటుంబ సభ్యులు కోడెలను హుటాహుటీన నగరంలోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎంతగా యత్నించినా కోడెల ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ క్రమంలో కోడెల ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిబంధనల మేరకు పోస్ట్ మార్టం ప్రభుత్వాసుపత్రిలో జరగాల్సి ఉండగా... కోడెల పార్థీవదేహాన్ని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కోడెల భౌతిక కాయానికి పోస్ట్ మార్టం నిర్వహించి... పార్థీవ దేహాన్ని మొన్న సాయంత్రానికే కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే పోస్ట్ మార్టం నివేదికను మాత్రం బుధవారం సాయంత్రం ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందజేశారు. ఈ నివేదికలోనే కోడెల ప్రాణాన్ని తీసుకునేందుకు వెంటవెంటనే రెండు యత్నాలు చేశారని తేలింది.
ఇదిలా ఉంటే... కోడెల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసులో పలు కీలక విషయాలను రాబట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల ఎవరితోనే సుదీర్ఘంగా 24 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారని, ఆ ఫోన్ కాల్ ముగిసిన తర్వాతే తన గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయం తెలిసిందే కదా. కోడెల చేసిన చివరి ఫోన్ కాల్ ఎవరికి? అన్న విషయంపై నిన్నటిదాకా ఆసక్తి రేకెత్తింది. తాజాగా ఆ ఫోన్ కాల్ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఉద్యోగి సునీతతోనే ఆ ఫోన్ కాల్ లో కోడెల మాట్లాడారని తాజాగా పోలీసులు నిర్ధారించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఆమెను కూడా విచారించే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఓ వైపు పోస్ట్ మార్టం నివేదిక అందడం, మరోవైపు లాస్ట్ ఫోన్ కాల్ వెళ్లింది ఎవరికన్న విషయం తేలిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తును స్పీడప్ చేసేశారు. త్వరలోనే చిక్కుముడులు విడిపోవడం ఖాయమేనన్న మాట.