Begin typing your search above and press return to search.
అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ లోనే?
By: Tupaki Desk | 21 Aug 2015 5:20 AM GMTఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఏపీ పాలనను విజయవాడ నుంచి చేపట్టాలన్న నిర్ణయంతో పాటు.. రానున్న రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పాలనను చేపట్టాలని భావిస్తున్న వేళ.. ఏపీలో ఎక్కడో ఒకచోట తాత్కలికంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారన్న వాదన వినిపించింది. నిజానికి.. ఈ వాదన తెరపైకి రావటం ఇది తొలిసారి కాదు.
విభజన తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో కాకుండా నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించాలన్న ప్రయత్నం జరిగింది. ఒకదశలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నాగార్జున యూనివర్సిటీని సందర్శించి.. ఏర్పాట్లు చేయాలని భావించారు కూడా. అయితే.. నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా లేకపోవటంతో హైదరాబాద్ లోనే నిర్వహించారు.
నాగార్జున యూనివర్సటీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదన్న పండితుల సూచన మేరకే చంద్రబాబు నో చెప్పారని అంటారు. తాజాగా విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న మాట వినిపించింది. అయితే.. సౌకర్యాల విషయంలో ఉండే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోడెల పేర్కొన్నారు. దీంతో.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోనే అని తేలిపోయింది. చూస్తుంటే.. పాలన ఏపీలో సాగిన.. అసెంబ్లీ సమావేశాలు కొంతకాలం హైదరాబాద్ లోనే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.