Begin typing your search above and press return to search.
అదానీ విల్మర్ సిగకు 'కోహినూర్' చేరింది.. ఆ షేరుకు మరింత జోరు!
By: Tupaki Desk | 4 May 2022 5:15 AM GMTవ్యాపార రంగంలో తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్నారు అదానీ. ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినా.. దాని సంగతి చూసే వరకు నిద్రపోరు. ఆయనకు చెందిన వంట సరుకుల విక్రయాల్లో అగ్రగామి సంస్థగా పేరున్న అదానీ విల్మర్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సంస్థ పలు విభాగాల్లోకి విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా మెక్ కార్మిక్ అనే స్విస్ సంస్థకు చెందిన కోహినూర్ బ్రాండ్ ను సొంతం చేసుకుంది.
తాజా డీల్ తో ఫుడ్ బిజినెస్ లో మరింత పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. ఈ డీల్ విలువ ఎంతన్న విషయాన్ని మాత్రం అదానీ విల్మర్ వెల్లడించలేదు. తాజాగా కొనుగోలు చేసిన సంస్థకు సంబంధించి కోహినూర్ పేరుతో విక్రయించే బాస్మాతీ బియ్యంతో పాటు.. రెడీ టు కుక్.. రెడీ టు ఈట్ లాంటి మీల్ పోర్ట్ ఫోలియో మీద అదానీ విల్మర్ కు విక్రయ హక్కులు దక్కున్నాయి.
కోహినూర్ బ్రాండ్ కింద కోహినూర్ ప్రీమియం బాస్మతీ రైస్.. చార్మినార్ అఫర్డబుల్ రైస్.. హోరేకా హోటల్.. రెస్టారెంట్.. కేఫ్ సెగ్మెంట్లు ఉన్నాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు.. సింగపూర్ కు చెందిన విల్మర్ గ్రూపు జాయింట్ వెంచర్ గా దీన్ని చెప్పాలి. ఈ సంస్థలో ఈ రెండు కంపెనీలకు చెరిసగం వాటా ఉంది. కొంతకాలం క్రితం ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ తన వాటాలో 12 శాతం షేర్లను విక్రయించటం తెలిసిందే. దీంతో.. వీరిద్దరికి 88 శాతం వాటా ఉంది. చెర సమానంగా ఉంది.
ఈ షేర్ ను ఫిబ్రవరి 8న స్టాక్ ఎక్సైంజీల్లో నమోదు కాగా.. ఇష్యూ ధర రూ.230తో పోలిస్తే ఈ షేరు స్వల్ప వ్యవధిలో 231.98 శాతం వరకు పెరగటం గమనార్హం. ఒక దశలో ఒక్కో షేరు 800 రూపాయిలకు పైకి దూసుకెళ్లింది కూడా. ఐపీవోలో షేరు దక్కించుకొని ఇప్పటివరకు తమ వద్ద ఉంచుకున్న షేర్ హోల్డర్ కు ఒక్కో షేరు మీద రూ.526 మేర లాభం రావటం విశేషం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సంస్థ తన త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. కంపెనీ నికర లాభం 26 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. లాభం తగ్గటం ఒక మైనస్ అయితే.. తాజాగా ఈ కంపెనీ కోహినూర్ సంస్థను సొంతం చేసుకోవటం ద్వారా మరింత దూకుడును ప్రదర్శించే వీలుందంటున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ షేరు మరింత దూకుడు ప్రదర్శించే వీలుందన్న అంచనా వేస్తున్నారు.
చట్టబద్ధమైన హెచ్చరిక ఏమంటే.. ఈ విశ్లేషణ మొత్తం కూడా నిపుణుల అభిప్రాయంతో మాత్రమే చెబుతున్నాం. ఈ కారణంతో దీన్ని నమ్మి.. మీరు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ సొంత విచక్షణతోనే షేరు కొనుగోలు చేయాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం.