Begin typing your search above and press return to search.
కోహ్లీకి రోహిత్ నుంచి ముప్పు..
By: Tupaki Desk | 8 July 2019 11:04 AM GMTఈ వన్డే ప్రపంచకప్ లో వరుస సెంచరీల మోత మోగిస్తున్న భారత వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీకే ఎసరు తెస్తున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ ఇప్పుడు ప్రపంచకప్ లోనే అత్యధిక పరుగులు చేసి నంబర్ 1 గా కొనసాగుతున్నారు. ఏకంగా ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 647 పరుగులు చేశాడు.
రోహిత్ వరుస సెంచరీల నేపథ్యంలో తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీకి ఎసరు పెట్టాడు రోహిత్ శర్మ. బ్యాటింగ్ విభాగంలో ఏకంగా రెండోస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఐసీపీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ నంబర్ 1 ర్యాంకులో ఉన్నారు. కోహ్లీ ఖాతాలో ఇప్పుడు 891 పాయింట్లున్నాయి. రోహిత్ వరుస సెంచరీలతో ఏకంగా 51 పాయింట్లు మెరుగు పరుచుకొని 885 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య కేవలం 6 పాయింట్ల తేడానే. రోహిత్ ఇలాగే జోరు కొనసాగిస్తే ప్రపంచకప్ మిగిశాక టాప్ ర్యాంక్ కు చేరుకోవడం ఈజీనే అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.
రోహిత్ కెరీర్ లోనే టాప్ 2 ర్యాంకుకు చేరుకోవడం ఇదే ప్రథమం. ఇదే అతడి అత్యుత్తమ ర్యాంక్. ఇక బౌలర్ల ర్యాంకింగ్ లో భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి 1వ ర్యాంకును పదిలపరుచుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో 17 వికెట్లు పడగొట్టడం ద్వారా ఏకంగా 35 పాయింట్లు సంపాదించి నంబర్ 1 బౌలర్ గా మరింత ముందుకెళ్లాడు. ప్రస్తుతం 814 పాయింట్లతో నంబర్ 1గా బుమ్రా ఉన్నాడు. ఇక రెండోస్థానంలో 758 పాయింట్లతో న్యూజిల్యాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండోస్థానంలో చాలా దూరంలో ఉన్నారు. మూడో స్థానంలో పాట్ కమిన్స్ 698 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు.