Begin typing your search above and press return to search.

కోహ్లీ , రోహిత్ ఫోటోలు వైరల్ ... అభిమానుల నవ్వులు !

By:  Tupaki Desk   |   25 Aug 2021 11:30 PM GMT
కోహ్లీ , రోహిత్ ఫోటోలు వైరల్ ... అభిమానుల నవ్వులు !
X
టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ సమయంలో ఈ రోజు ఇండియా ఆటగాళ్ల ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆటగాళ్ల ఫోటోలు వైరల్ అవ్వడం కామన్ కదా అనుకుంటే పొరపాటు. ఈ రోజు వైరల్ అయ్యే ఫొటోలకి ఓ ప్రత్యేకత ఉంది. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారనడంలో సందేహం లేదు. లావుగా ఉంటే భారత క్రికెట్ స్టార్ ఆటగాళ్లు ఎలా ఉంటారనే ఆలోచనతో ఓ అభిమాని చేసిన ప్రయత్నం నవ్వులు తెప్పిస్తోంది.

టీమిండియాలోని స్టార్ క్రికెటర్లను ఫాట్‌గా తయారు చేయడంలో ఎంతో కష్టపడ్డాడు. చాలా ఫిట్‌గా ఉండే భారత ఆటగాళ్లు.. ఫాట్ ఇండియాగా తయారు చేశాడు. ఈ ఫొటోలో క్రికెటర్లు ఎంతో లావుగా, బానెడు పొట్టతో కనిపించారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో క్రికెటర్ల ముఖ కవళికలు మాత్రం మారకుండా అలానే ఉన్నాయి. అచ్చం అంకుల్స్‌ను తలపించేలా తయారయ్యారు. దీంతో ఈ ఫొటోలపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫిట్‌గా ఉండే మన టీమిండియా క్రికెటర్లు ఇలా అయ్యారేంటి అంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. భ్యవిషత్తులో మన క్రికెటర్లు ఇలానే తయారవుతారా ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

దీంతో ఫిట్‌గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్‌ఫిట్‌గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్‌ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్‌లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో చమటోడ్చారు.