Begin typing your search above and press return to search.
ప్రపంచ కప్ లేకుండానే ముగియనున్న కోహ్లి కెప్టెన్సీ?
By: Tupaki Desk | 8 Nov 2021 7:42 AM GMTవిరాట్ కోహ్లి.. తిరుగులేని ఫిట్నెస్.. ఎదురేలేని బ్యాటింగ్.. ఆటగాడిగా ఉన్నా.. కెప్టెన్ గా ఉన్నా.. పట్టుదల అతడి సొంతం. మైదానంలో ఆటలోనూ అది కనిపిస్తుంటుంది. అయితే, అలాంటి కోహ్లి ప్రపంచ కప్ అనే కిరీటం అందుకోకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ అనంతరం విరాట్.. టి0 ఫార్మాట్ కెప్టెన్ గా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. మరోవైపు కోహ్లి వన్డే సారథ్యంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు రోహిత్ శర్మను కెప్టెన్ ను చేసి విరాట్ ను టెస్టు ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగించాలన్నది బీసీసీఐ ఆలోచనగా చెబుతున్నారు. ఇదే జరిగితే.. కోహ్లి వన్డే కెప్టెన్సీనీ వదులుకోక తప్పదు. మొన్ననే 33వ ఏట అడుగు పెట్టిన కోహ్లి ఫామ్ పరంగానూ కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడు సెంచరీ చేసి రెండేళ్లయింది. అయితే, అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపిస్తూ వస్తున్నాడు. కానీ, కోహ్లి స్థాయికి సెంచరీనే సరైన మార్క్.
అప్పుడలా? ఇప్పుడిలా?
ధోని నుంచి 2016-17లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ స్వీకరించిన కోహ్లి 2019 వన్డే ప్రపంచకప్, ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లలో టీమిండియాకు సారథ్యం వహించాడు. వన్డే ప్రపంచ కప్ లో భారత్ ను సెమీఫైనల్ దశకు చేర్చాడు. అనూహ్యంగా ఆ మ్యాచ్ లో మన జట్టు ఓటమి పాలైంది. అలా వన్డే ప్రపంచ కప్ చేజారింది. ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లోనూ టీమిండియా ఫేవరెట్ గా అడుగుపెట్టింది. అందులోనూ తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కావడంతో మరింత ఉత్కంఠగా టైటిల్ వేట ప్రారంభమైంది. కానీ, పాక్ తో మ్యాచ్ లో ఓటమితో అంతా తలకిందులైంది. వన్డే వరల్డ్ కప్ లో లానే ఇక్కడా మరోసారి న్యూజిలాండ్ దెబ్బకొట్టడంతో సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రెండు ప్రపంచ కప్ ల లోనూ కోహ్లి జట్టు ఉత్త చేతులతోనే వెనుదిరిగింది. ఇక వన్డేల్లోనూ రోహిత్ కు పగ్గాలు అప్పగిస్తే కోహ్లి సాధారణ సభ్యుడిగానే జట్టులో మిగిలిపోవాల్సి ఉంటుంది.
ఆటగాడినైనా కప్ ఎత్తే అవకాశం ఉంటుందా?
ప్రపంచంలో ప్రస్తుతం నెంబర్ వన్ బ్యాట్స్ మన్ కోహ్లినే. ఆటగాడిగా అతడికి జట్టులో చోటుపై సందేహం లేదు. కాబట్టి మున్ముందు జట్టు సభ్యుడిగానైనా విరాట్ ప్రపంచ కప్ విజేత జట్టులో ఉంటాడని ఆశించొచ్చు. 2022 టి20 ప్రపంచ కప్ నకు మరో ఏడాది కూడా లేదు. అది జరగబోయేది ఆస్ట్రేలియాలో. టి20 ఫార్మాట్ కు అన్ని విధాల అనువైన అక్కడి పిచ్ లపై మన బ్యాట్స్ మన్, బౌలర్లు రాణించే వీలుంటుంది. తద్వారా కప్ పై ఆశలు పెట్టుకోవచ్చు. అప్పుడైనా కోహ్లి కప్ పట్టుకోవడం చూడొచ్చు.
టెస్టు చాంపియన్ షిప్ అవకాశం ఉంది.. కానీ?
వన్డేలు, టి20ల్లో సారథిగా ప్రపంచ కప్ ను ముద్దాడలేకపోయిన కోహ్లికి.. మరో చాన్సంది. అదేమంటే టీమిండియాను ప్రపంచ చాంపియన్ గా నిలిపే అవకాశం. సంప్రదాయ ఫార్మాట్ లో జగజ్జేత ఎవరనేది తేల్చేందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019-21 మధ్య కాలానికి జరిగిన ఈ చాంపియన్ షిప్ లో కోహ్లి నాయకత్వంలోని మన జట్టు రన్నరప్ గా మిగిలింది. జూన్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ దెబ్బకొట్టకుంటే కోహ్లి సేన చాంపియన్ గా నిలిచేది. గతాన్ని వదిలేస్తే 2021-23 మధ్య కాలానికి టెస్టు చాంపియన్ షిప్ మొదలవనుంది. ఇప్పటివరకైతే వచ్చే రెండేళ్లు టెస్టులకు కోహ్లినే కెప్టెన్ గా ఉంటాడని చెప్పొచ్చు. జట్టులో టెస్టుల్లో
అతడి స్థాయికి తగ్గ ఆటగాడు లేకపోవడమే దీనికి కారణం. కానీ, కాలం ఎలా ఉంటుందో చెప్పలేం కదా? కోహ్లి వన్డేలు, టి20 కెప్టెన్సీని వదులుకుంటాడని రెండేళ్ల క్రితం మనం ఎవరూ ఊహించలేదు కదా? ఇదీ అలాగే. వచ్చే రెండేళ్లలో ఏమైనా జరగొచ్చు. కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్ మన్ మరింత రాటుదేలి కెప్టెన్ గా ఎదగొచ్చు. కోహ్లి సారథ్యం వదులుకుని అతడికి అప్పగించొచ్చు. కాబట్టి.. కెప్టెన్ గా కోహ్లి ప్రపంచ కప్ ను అందుకుంటాడా? లేడా? అన్నది కాలమే నిర్ణయించాలి.