Begin typing your search above and press return to search.

కోహ్లి విధి విచిత్రం.. పాకులాడిన కెప్టెన్సీనే వదులుకోవడం

By:  Tupaki Desk   |   15 Jan 2023 6:30 AM GMT
కోహ్లి విధి విచిత్రం.. పాకులాడిన కెప్టెన్సీనే వదులుకోవడం
X
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి సరదా మనిషి. ఒకప్పుడు పార్టీ బర్డ్. 2012లో ఓ మ్యాచ్ లో తాను ఔటైన తీరును చూసుకుని తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో ఫిట్ నెస్ పై చూపుసారించాడు. అన్నిటినీ పక్కనపెట్టాడు. ఆఖరికి అతడు తాగే మంచినీటి సీసా ఖరీదు రూ.400. ఇక డైట్ విషయం చెప్పక్కర్లేదు. అయితే, ఇవన్నీ పాటిస్తున్న క్రమంలోనే విరాట్.. ప్రియ సఖి అనుష్క శర్మను వివాహమాడాడు. సహజంగానే సినీ నటి కావడంతో అనుష్క ఫిట్ నెస్ పాటిస్తుంటుంది. మరోవైపు వీరిద్దరి వ్యాపార ప్రకటనలూ ప్రేక్షకులు, ప్రజల ఆరోగ్యానికి చేటు చేయనివే అయి ఉంటాయి. తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్ లో తలపడుతున్న టీమిండియా

ఆదివారం చివరి మ్యాచ్ ఆడనుంది.

కేరళ తీరంలో హాయి.. హాయి ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచేసిన టీమిండియా మూడో వన్డేను కేరళలోని తివేండ్రంలో ఆడనుంది. కేరళ అంటేనే దేవతల భూమి. పర్యాటకానికి పేరుగాంచిన ఆ రాష్ట్రంలో చెప్పలేనన్ని ఆకర్షణీయ ప్రదేశాలు. ఇక మూడో వన్డే ఆతిథ్యం ఇవ్వనున్నది తివేండ్రం. ఈ నేపథ్యంలోనే కోహ్లీ తన సతీమణి అనుష్కశర్మతో కలిసి అక్కడి సముద్ర తీరంలో సేదతీరుతున్నాడు. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ పోస్టు కింద ఆయన ఫ్యాన్స్‌ ‘బెస్ట్‌ కపుల్‌’ అంటూ కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

నాడు కెప్టెన్సీకి ఆరాటం.. నిరుడు త్యాగం

మహేంద్ర సింగ్ ధోని నుంచి 2014 చివరలో కోహ్లి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించాడు. అయితే, 2018 నాటికి గాని అతడికి పరిమిత ఓవర్ల సారథ్యం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ మూడేళ్లు కోహ్లి పరిమిత ఓవర్ల జట్టు సారథ్యమూ కావాలని ఆరాటపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ చెప్పడం గమనార్హం. ఏడేళ్లు జట్టుతో కలిసి పని చేసిన అతను ‘కోచింగ్‌ బియాండ్‌- మై డేస్‌ విత్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌’ పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అందులో సంచలన విషయాలను ప్రస్తావించాడు. ధోని స్వయంగా సారథ్యాన్ని ఇచ్చేంతవరకూ ఎదురు చూడాలని కోహ్లీకి అప్పటి ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి సూచించాడని అందులో శ్రీధర్‌ పేర్కొన్నాడు. ‘‘ఓ సాయంత్రం కోహ్లీని రవిశాస్త్రి పిలిచి మాట్లాడాడు. ‘చూడు విరాట్‌.. ధోని నీకు టెస్టు కెప్టెన్సీ ఇచ్చాడు.

నువ్వు అతణ్ని గౌరవించాలి. సరైన సమయంలో పరిమిత ఓవర్ల సారథ్యాన్ని కూడా నీకే వదిలేస్తాడు. ఇప్పుడు నువ్వు అతణ్ని గౌరవించకపోతే కెప్టెన్‌ అయిన తర్వాత జట్టు నుంచి నీకు కూడా మర్యాద దక్కదు. జరిగేదాన్ని పక్కనపెట్టి అతణ్ని గౌరవించు. సారథ్యం కోసం పరుగులు పెట్టకు’ అని కోహ్లీకి చెప్పాడు’’ అని పుస్తకంలో శ్రీధర్‌ చెప్పాడు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలోనే ధోని రిటైర్మెంట్‌ గురించి తనకు తెలుసని పేర్కొన్నాడు. 2020 ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా, ఇదే కోహ్లి 2021 చివర్లో టి20 కెప్టెన్సీని వదులుకుని వన్డే కెప్టెన్సీని అట్టిపెట్టుకుంటానని క్రికెట్ బోర్డుతో ప్రతిపాదించాడు. అలా కుదరదనే సరికి వన్డే కెప్టెన్సీని
తర్వాత టెస్టు కెప్టెన్సీని కూడా

వదిలేశాడు. విధి విచిత్రం అంటే.. అదేనేమో..?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.