Begin typing your search above and press return to search.
విరాట్ కోహ్లి తాగే లీటర్ వాటర్ ధర ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 23 Aug 2021 11:40 AM GMTప్రపంచ క్రికెట్ రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ పై ఎనలేని శ్రద్ద చూపిస్తుంటారు. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటాడు కూడా. రోగ్యం, దేహధారుడ్యంపై ఎంత శ్రద్ద వహిస్తుంటాడో మనం చూస్తూనే ఉంటాం. తినే తిండి నుంచి తాగే నీళ్ల వరకు ప్రతీదీ లెక్కలేసుకొని మరీ తీసుకుంటుంటాడు. కోహ్లీ 2014 నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయాడు. మైదానంలో అంత చురుకుగా ఉండటానికి కారణం అతడికి ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్దే అని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు.
కోహ్లీ కూడా తన అభిమానులకు ఫిట్‌నెస్ సలహాలు ఇస్తుంటాడు, అంతే కాకుండా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాడో కూడా చెబుతుంటాడు. కోహ్లీ గత కొన్నాళ్లుగా బ్లాక్ వాటర్ తాగుతున్నట్లు వెల్లడించాడు. మనకు నీళ్లంటే స్వచ్ఛంగా కనపడాలి. కాస్త మురికిగా ఉన్నా వాటిని మనం ముట్టుకోము. అప్పుడప్పుడు మున్సిపల్ నల్లాలో కల్తీ నీళ్లు రావడం మనం చూస్తూనే ఉంటాము. అయితే కోహ్లీ తాగేవి అలా ఏది పడితే అది కలసి నల్లగా మారిపోయిన నీళ్లు కాదంటా. అతడు తన శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఈ నీళ్లు తాగుతుంటాడట. ఈ నల్లని నీళ్లలో పీహెచ్ వాల్యూ అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోకుండా చూస్తుంది.
సాధారణంగా మనం తాగే ప్యాకేజ్డ్ వాటర్ రూ. 20 రూపాచలే ఏంటేంది. మరీ ఖరీదైన నీళ్లంటే రూ. 100 వరకు ఉంటాయి. కానీ ఈ బ్లాక్ వాటర్ ధర లీటర్‌కు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ఉంటుంది. బ్లాక్ వాటర్ తయారీదారులు అందులో బ్లాక్ ఆల్కలైన్‌ను కలుపుతారు. అందులో సహజసిద్దమైన అల్కలైన్ ఉంటుంది. అందుకే ఆ నీళ్లు చాలా ఖరీదు. ఇందులో పీహెచ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. మైదానంలో రోజంతా ఫీల్డింగ్, బ్యాటింగ్ కోసం ఉన్న ఆటగాళ్లు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. లేదంటే ఊరుకూరికే నీళ్లు తాగుతుండాలి. అందుకే ఎక్కువ సమయం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికే కోహ్లీ ఈ బ్లాక్ ఆల్కలైన్ నీళ్లు తాగుతాడని తెలుస్తున్నది.
కేవలం కోహ్లీ మాత్రమే కాకుండా సినీ నటులు ఊర్వశీ రౌటేలా, మలైకా అరోరా, శృతి హాసన్ కూడా ఈ నీటిని తాగుతారంటా. ఈ నీళ్లు తాగడం వల్ల చర్మ నాణ్యత కూడా మెరుగు పడటమే కాకుండా శరీర బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నా.. బయటకు వెళ్లినా ఈ వాటర్ బాటిల్ వెంట ఉంచుకుంటాడు. కేవలం ఈ నీళ్ల కోసమే నెలకు రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన క్రికెటర్ గా రికార్డులకు ఎక్కిన కోహ్లీకి నీళ్ల కోసం అంత ఖర్చు పెట్టడం పెద్ద భారమేమీ కాదు. ఎవకస్ బ్రాండ్ బ్లాక్ అల్కలైన్ వాటర్ ఖరీదు దాదాపు రూ. 4000. ఇటీవలే ఈ కంపెనీ తన బ్రాండ్ వాటర్ కు సంబంధించిన చిన్న క్లిప్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.