Begin typing your search above and press return to search.
కోహ్లీ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు
By: Tupaki Desk | 16 July 2021 4:35 PM GMTఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను కరోనా పట్టేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ తోపాటు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. ఇక వారితోపాటు ఉన్న మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సైతం క్వారంటైన్ లోకి వెళ్లాడు.
ఈ క్రమంలోనే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది. ఐదు టెస్టుల సిరీస్ వరకు పంత్ కోలుకుంటాడా? లేదా? అన్నది ఆందోళనగా మారింది. ఇప్పటికిప్పుడు పంపినా రెండు వారాలా పాటు క్వారంటైన్ జట్టుతో కొత్త ఆటగాడు కలవాలంటే ఇబ్బంది.
ఈ క్రమంలోనే టీమిండియాకు వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. కీపింగ్, బ్యాటింగ్ కిట్ కు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశాడు.
డర్హమ్ లో భారత జట్టు కౌంటీలతో ప్రాక్టీస్ మ్యాచ్ కు ఇప్పుడు సిద్ధమైంది. ఇద్దరు కీపర్లు పంత్, సాహాలు ఐసోలేషన్ లో ఉండడంతో ఇప్పుడు వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారన్నది ఆందోళనగా ఉంది. ఇక బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ సామర్థ్యం ఉంది. వన్డే, టీ20ల్లో అతడు చేసి ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో చేయలేదు. ఇంగ్లండ్ తో మొదటి టెస్టులోపు కేఎల్ రాహుల్ ను పరీక్షించాలని టీమిండియా సిద్ధమైంది.
ఇకవేళ రాహుల్ కాదంటే తాను సిద్ధంగా ఉన్నానని తాజాగా దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం టీవీల్లో కామెంటేటర్ గా ఇంగ్లండ్ లోనే ఉన్న దినేష్ కార్తీక్ టీమిండియా ఇబ్బందుల దృష్ట్యా వికెట్ కీపింగ్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు వికెట్ కీపింగ్ కిట్ ఫొటోనుషేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.