Begin typing your search above and press return to search.
కుంబ్లే ఎపిసోడ్‌పై కోహ్లీ పెదవి విప్పాడండోయ్
By: Tupaki Desk | 22 Jun 2017 7:44 PM GMTదేశంలోని క్రీడాభిమానులు ఏ ఇద్దరు కలిసినా కుంబ్లే.. కోహ్లీ విభేదాల మీద మాట్లాడుకునే వారే. ఇక.. మీడియాలోనూ ఈ ఎపిసోడ్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. టన్నుల కొద్ది కాగితం.. వేలాది గంటల్ని మీడియా ఖర్చు చేస్తోంది. ఇంత హాట్ గా నడుస్తున్న ఈ అంశంపై వివాదానికి సంబంధం ఉన్న ఇద్దరిలో కోచ్ గా గుడ్ బై చెప్పిన కుంబ్లే ట్వీట్ తో తాను చెప్పాల్సింది చెప్పేశాడు.
కుంబ్లే ట్వీట్ తర్వాత ఈ విషయంపై రేగిన రచ్చ అంతా ఇంతా కాదు. పలువురు క్రీడాకారులు సైతం కోహ్లీ తీరును తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లు చేశారు. ఇలాంటి వేళ.. తాజాగా కోహ్లీ ఈ వ్యవహారంపై పెదవి విప్పారు. రేపటి నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సీరిస్ ప్రారంభం కానున్న వేళ కరేబియన్ గడ్డపై కోహ్లీ పెదవి విప్పారు.
కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్ భాయ్ నిర్ణయం తీసుకున్నారని.. అది ఆయన అభిప్రాయమని.. దాన్ని తాను గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కుంబ్లే రాజీనామా వెనుకున్న కారణం గురించి మాట్లాడేందుకు కోహ్లీ ఇష్టపడలేదు. డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధం లేని చాలామంది చాలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారంగా కోహ్లీ చెప్పారు.
ఇదిలా ఉంటే.. గతంలో కుంబ్లేను కోచ్ గా ఆహ్వానిస్తున్న పెట్టిన ట్వీట్‌ను తాజాగా కోహ్లీ డిలీట్ చేయటం ఆసక్తికరంగా మారటమే కాదు..కుంబ్లేను తానెంతగా ద్వేషిస్తున్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.