Begin typing your search above and press return to search.

మైదానంలో కోహ్లీ ఓవర్​యాక్షన్​ నిజమే..! బౌలర్​ షమీ వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   20 May 2021 3:30 AM GMT
మైదానంలో కోహ్లీ ఓవర్​యాక్షన్​ నిజమే..! బౌలర్​ షమీ వ్యాఖ్యలు..!
X
టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఎంత ఉత్సాహంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో బ్యాటింగ్​ చేస్తున్నా.. లేదా ఫీల్డింగ్ లో ఉన్నా తన భావోద్వేగాన్ని ఏ మాత్రం దాచుకోడు. సెంచరీ కొట్టినప్పుడు గట్టిగా అరుస్తుంటాడు. దీన్ని కొందరు ఉత్సాహం అంటారు.. కొందరు ఓవర్​ యాక్షన్​ అంటారు.. మరికొందరేమో అతడి నైజం అంటారు. ఇదిలా ఉంటే కోహ్లీ.. వికెట్​ పడినప్పుడు కూడా హడావుడి చేస్తుంటాడు. వికెట్​ తీసిన బౌలర్​, క్యాచ్​ పట్టిన ఫీల్డర్​ కూడా ఆ రేంజ్​ లో సంబరాలు చేసుకోరు. కానీ కోహ్లీ మాత్రం పెద్దగా అరుస్తూ.. మైదానంలో రచ్చ రచ్చ చేస్తుంటాడు.దీన్ని అతడి ఫ్యాన్స్​ ఎంజాయ్​ చేస్తారేమో కానీ.. అవుటయిన బ్యాట్స్​ మెన్​ కచ్చితంగా ఫీల్​ అవుతాడు. అంటే ఫీల్​ అవ్వాలనే అలా చేస్తాడేమో కోహ్లీ.

ఇదిలా ఉంటే కోహ్లీ తీరుపై తాజాగా బౌలర్​ షమీ .. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా ఈ విషయంపై వ్యాఖ్యానించాడు. మైదానంలో నేను వికెట్​ తీసినప్పుడు కూడా కోహ్లీ ఫుల్​గా సెలబ్రేషన్స్​ చేసుకుంటూ ఉంటాడు. నాకు కోపం వచ్చి ఓ సారి ఈ విషయం కోహ్లీనే అడిగేశా. ఇంతకీ వికెట్​ తీసింది నువ్వా? నేనా? అని.. దానికి కోహ్లీ నవ్వాడు' అంటూ షమీ పేర్కొన్నాడు. నిజానికి కోహ్లీ ఎంతో ఉత్సాహంగా .. తన తోటి క్రీడాకారులను కూడా ఉత్సాహ పరుస్తుంటాడు. వికెట్​ పడ్డప్పుడు.. తోటి ఆటగాళ్లను మరింత ఉత్సాహ పరుస్తుంటాడు. ఇది జట్టు సమిష్టి విజయానికి కూడా పనికొస్తుందేమో తెలియదు కానీ.. కోహ్లీపై మాత్రం ఓవర్​ యాక్షన్​ అంటూ విమర్శలు వస్తుంటాయి.

గతంలోనూ పలుమార్లు విరాట్​ కోహ్లీ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తన మ్యానరిజం ఇంతేనంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయంపై టీమిండియా బౌలర్​ షమీ మాట్లాడం గమనార్హం. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్ టెస్టుల కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ 20 మందితో కూడిన జట్టును ప్రకటించేసింది. జూన్ 2న ఇంగ్లండ్‌కి కోహ్లీసేన.. ఇంగ్లాండ్​ వెళ్లనున్నది.

న్యూజిలాండ్‌తో 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌ లో ఢీకొట్టబోతోంది. ఈ నేపథ్యంలో షమీ ఓ మీడియా చానల్​ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే.. ‘నిజానికి కోహ్లీ బౌలర్లను , యువ బ్యాట్స్​ మెన్లను ఎంతో ప్రోత్సహిస్తాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన బౌలర్లకు ధైర్యం నూరిపోస్తాడు. మైదానంలో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తాడు. కేవలం జట్టు ఓడిపోయినప్పుడు మాత్రమే కోహ్లీ కొంచెం చిరాగ్గా కనిపిస్తాడు. మిగతా టైంలో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు' అనిచెప్పుకొచ్చాడు షమీ.