Begin typing your search above and press return to search.

టీ20 కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత కోహ్లీ స్పందన

By:  Tupaki Desk   |   10 Nov 2021 12:30 PM GMT
టీ20 కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత కోహ్లీ స్పందన
X
టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకం ముగిసిపోయింది. టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దీనిపై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. జట్టు సభ్యులకు, మాజీ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వాటికి కొన్ని ఫొటోలను జత చేశాడు. మైదానంలో ఒక్కడే ఉన్న ఫొటోను పెట్టి తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నాడు.

మన లక్ష్యాన్ని చేరుకునేందుకు మనందరం ఒక్కటిగా ఉన్నాం. దురదృష్టం కొద్దీ మనం ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. అందుకు ఏ ఒక్కరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ గా నాకు మీరందించిన సహకారం అమోఘం. దానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా, మళ్లీ పుంజుకునేందుకు ఒక్కటిగా కలిసి పనిచేద్దాం. లక్ష్యం వైపు అడుగులేద్దాం జైహింద్ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇటు మాజీ కోచ్, సహాయ సిబ్బందితో తన ప్రయాణం గురించి కూడా రాసుకొచ్చాడు. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మరపురాని జ్ఞాపకాలను మిగిల్చారు. జట్టు కోసం మీరు చేసిన కృషి అద్భుతం. భారత క్రికెట్ చరిత్రలో మీ వంతు సహకారం నిలిచిపోతుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భవిష్యత్ జీవితంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.

ఈ నెల 17 నుండి టీం ఇండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడనుండగా… దానికి తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టీ20 ఫార్మటు లో కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు ఎవరు చెప్పటనున్నారు అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానంగా రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది. ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది. ఇక ఈ జట్టులో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్ వంటి వారిని అనూహ్యంగా ఎంపిక చేయగా.. శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ వంటి వారిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి వారికి విశ్రాంతిని ఇవ్వడం కోసం ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదు అనేది తెలుస్తుంది.