Begin typing your search above and press return to search.
కోహ్లీ...ఫోర్బ్స్ లిస్ట్ లోని ఒకే ఒక్కడు
By: Tupaki Desk | 8 Jun 2017 4:35 PM GMTప‌్రపంచంలో బాగా సంపాదిస్తున్న స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. వంద మంది లిస్ట్ లో ఇండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్ కు మాత్రమే చోటు దక్కింది. అతనెవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఏడాదికి రూ.141 కోట్ల సంపాదనతో ఈ జాబితాలో 89వ స్థానంలో ఉన్నాడతడు. ఇందులో మ్యాచ్ లు ఆడినందుకు జీతంగా రూ.19 కోట్లు రాగా.. మిగతా మొత్తమంతా ఎండార్స్ మెంట్ల ద్వారానే రావడం విశేషం. ఈ లిస్ట్ లో పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
విరాట్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడని ఈ సందర్భంగా ఫోర్బ్స్ కొనియాడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డులపై కన్నేసిన విరాట్ సంపాదన.. 2015లో కెప్టెన్సీ వరించిన తర్వాత మరింత పెరిగింది. అయితే ఈ లిస్ట్ లో టాప్‌లో ఉన్న క్రిస్టియానో రొనాల్డో సంపాదన (రూ.598 కోట్లు)తో పోలిస్తే కోహ్లి సంపాదన చాలా తక్కువే. రొనాల్డో తర్వాత ఈ లిస్ట్ లో అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ ఉండగా.. అర్టెంటీనా సాకర్ స్టార్ మెస్సీ మూడు, ఫెదరర్ నాలుగు, అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కెవిన్ డ్యూరంట్ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక టాప్ 100లో ఉన్న ఏకైక మహిళా ప్లేయర్ గా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిలిచింది. ఒకప్పుడు క్రీడా ప్రపంచాన్ని ఏలిన గోల్ఫ్ స్టార్ ప్లేయర్ టైగర్ వుడ్స్ తాజా జాబితాలో 17వ స్థానానికి పడిపోయాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/