Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో ‘కింగ్’ సెంచరీ.. పలు రికార్డులు బ్రేక్..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 1:27 PM GMT
కొత్త ఏడాదిలో ‘కింగ్’ సెంచరీ.. పలు రికార్డులు బ్రేక్..!
X
టీం ఇండియా మాజీ కెప్టెన్.. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కొత్త ఏడాదిలో తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీ బాదేశాడు. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఫామ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ అదే ఫామ్ ను శ్రీలంకపై కొనసాగించాడు.

శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సెంచరీ బాదేశాడు. 113 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ భారత్ భారీ స్కోరులో చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

స్వదేశంలో 20 సెంచరీలు సాధించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండ్కూర్ తో కోహ్లీ సమంగా నిలిచాడు. సచిన్ సాధించిన 49 సెంచరీల్లో తొలి 20 సెంచరీలను 164 వన్డేల్లో కొట్టాడు. అయితే కోహ్లీ మాత్రం 102 వన్డేల్లోనే 20 సెంచరీలతో భారత్ వేదికగానే సాధించాడు. అదేవిధంగా శ్రీలంకపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ గా కోహ్లీ రికార్డులకెక్కాడు.

ఇంతకముందు 8 సెంచరీలతో సచిన్.. కోహ్లీ సమంగా ఉన్నారు. తాజా వన్డేల్లో కోహ్లీ సెంచరీ సాధించగా అతడి ఖాతాలో తొమ్మిది సెంచరీలు చేరాయి. దీంతో శ్రీలంకపై అత్యధిక శతకాలు సాధించిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా.. శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా కోహ్లీ నిలిచాడు.

మొత్తంగా కోహ్లీ అన్ని ఫార్మట్లలో కలిపి 73 శతకాలు చేశాడు. వీటిలో 27 టెస్టు సెంచరీలుగా కాగా మరో 45 వన్డే శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్ లో తొలిసారి టీ20 లో కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో సచిన్ వంద సెంచరీ రికార్డుల తర్వాత కోహ్లీ(73)తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఓవరాల్ గా వన్డేల్లో కోహ్లీ 12వేల 584 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికి దగ్గరగా జయవర్దనే 12వేల 650 ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 18వేల 426 పరుగులతో అందరికంటే ముందుండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.