Begin typing your search above and press return to search.

ఏదో తేడా..? వన్డే సిరీస్ కు కోహ్లి దూరం...?

By:  Tupaki Desk   |   4 Jan 2022 9:36 AM GMT
ఏదో తేడా..? వన్డే సిరీస్ కు కోహ్లి దూరం...?
X
తొలుత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. వన్డే కెప్టెన్సీ మాత్రం కావాలన్నాడు. సెలక్టర్లు ఒప్పుకోలేదు. వన్డే సారథ్యమూ తప్పించారు. ఈ క్రమంలో తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే విషయం ముందుగా చెప్పలేదని అన్నాడు. లేదు లేదు.. టి20ల కెప్టెన్ గా తప్పుకొన్నప్పుడే వన్డే సారథ్యమూ వదులుకోవాలని చెప్పామని సెలక్టర్లు అంటారు. సరే... ఆ వివాదం పక్కన పెడితే ... అంతా సద్దుమణిగింది అనుకుంటుండగా.. వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి తప్పించినందుకే ఇలా చేస్తున్నాడా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ తూచ్.. అదేమీ లేదని, వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇప్పుడు మళ్లీ వన్డే సిరీస్ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ఇదంతా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి..

ఆడకుంటే నిజంగా షాకే.. కెప్టెన్సీ మలుపులు.. ఒమిక్రాన్ భయాల మధ్య మొదలైన దక్షిణాఫ్రికా సిరీస్ ఇప్పుడు మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. వెన్ను నొప్పి అంటూ రెండో టెస్టు కు దూరమైన కోహ్లి మూడో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ కూడా ఆడడని తెలుస్తోంది.2వ టెస్ట్‌ అఖరి నిమిషంలో వెన్ను నొప్పి కారణంగా కోహ్లి తప్పుకున్నాడు.కేఎల్‌ రాహల్‌ కెప్టెన్పీ బాధ్యతలు చేపట్టాడు. కాగా టాస్‌ సమయంలో మాట్లాడిన రాహుల్‌.. ప్రస్తుం కోహ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, త్వరగాకోలుకుంటాడని తెలిపాడు. అయితే, వన్డేలకు కోహ్లి అందుబాటుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. లోలోపల ఉన్న అనాసక్తితోనే అతడీ నిర్ణయానికి వచ్చాడా? అన్న అనుమానాలు వస్తున్నాయి. వన్డే సిరీస్ ముందు ఒక్కసారిగా వైదొలగితే అనుమానాలు వస్తాయన్న ఆలోచనతో టెస్టు సిరీస్ నుంచే దూరంగా ఉన్నాడా? అనేది సంశయంగా మారింది. ఇప్పటివరకు ఇదంతా ఊహాగానమే అయినా, నిజమైతే సంచలనమే.

కోహ్లి అలా చేస్తాడా? ఎంత నిరాసక్తి ఉన్నప్పటికీ.. కోహ్లి ఉద్దేశపూర్వకంగా జట్టును ఇబ్బందిపెట్టే పనులు చేస్తాడా? అన్నవిషయం ఇప్పుడు చర్చనీయాంశం కానుంది. అలా జరిగితే అసలు అతడి పోరాట వ్యక్తిత్వం ఏమైంది? అన్నప్రశ్న తలెత్తుతుంది. నిజానికి టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహత్‌ శర్మ కూడా గాయంతో దూరమైన నేపథ్యంలో వన్డే సిరీస్ లో కోహ్లి అవసరం చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలోనే అతడు సిరీస్ కు దూరమవడం సమంజసం కాదు. ఈ కోణంలో చూసినా కోహ్లి వన్డేలు ఆడడం ముఖ్యం. కానీ, ఊహాగానాలు మాత్రం వేరుగా ఉన్నాయి. చూద్దాం ఏంజరుగుతుందో? ఇక భారత్‌-దక్షిణాఫ్రికా తొలి వన్డే ఈ నెల 19న జరగనుంది.