Begin typing your search above and press return to search.

కెప్టెన్ గా కోహ్లీ మరో కొత్త రికార్డ్ !

By:  Tupaki Desk   |   11 Jan 2020 6:05 AM GMT
కెప్టెన్ గా కోహ్లీ మరో కొత్త రికార్డ్ !
X
క్రికెట్ టీం ఇండియా కెప్టెన్ , రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి గత కొన్నేళ్లుగా ఎదురులేకుండా పోయింది. ఫార్మాట్ ఏదైనా కూడా కెప్టెన్ కోహ్లీ బ్యాట్ జుళిపిస్తూ జట్టుకి ఎన్నోసార్లు ఒంట్టి చేత్తో విజయాలని అందించాడు. ఇకపోతే ఈ సమయంలో ఎన్నో రికార్డ్స్ తనపేరుమీద లికించుకున్నాడు. తాజాగా పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

జనవరి 10 , శుక్రవారం శ్రీలంకతో మూడో టీ20లో తొలి పరుగు తీసి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌), ధోని(భారత్‌), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.

కాగా, భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగులని సాధించాడు. రికీ పాంటింగ్‌ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్‌ 303 మ్యాచ్‌ల్లో 11,561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు. విరాట్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈజీగా మొదటి స్థానంలోకి వచ్చేస్తాడు అని చెప్పవచ్చు.